విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కొత్త పేట సాయిరామ్ దియేటర్ నుండి నెహ్రూ బొమ్మ సెంటర్ వరకు సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో జాతీయ పార్టీ పిలుపు లో భాగంగా ‘మార్పు కావాలి – మార్పు రావాలి’ అనే నినాదంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ సిపిఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సిపిఐ పాదయాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు కామ్రేడ్ డాక్టర్ కే. నారాయణ, పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్, నగర పార్టీ కార్యదర్శి వర్గం,కార్యవర్గ సభ్యులు,మరియు నగర పార్టీ, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News