Breaking News

ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఎమ్మెల్సీ నాగబాబు నియామకం పట్ల మంత్రి కందుల దుర్గేష్ హర్షం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌లో పచ్చదనం పెంపు, అటవీ విస్తీర్ణం, పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ ‘ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్‌రిచ్‌మెంట్ (ఏపీ గ్రీన్)’ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా కేబినెట్ హోదా కల్పిస్తూ ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రరావు (నాగబాబు) నియామకం పట్ల మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ నాగబాబు నేతృత్వంలో “పచ్చని ఆంధ్రప్రదేశ్ – ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్” ఆశయ సాధన దిశగా రాష్ట్రం వేగంగా అడుగులు వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ఏపీ గ్రీన్ లక్ష్యాలు, కార్యక్రమాల అమలులో వివిధ ప్రభుత్వ శాఖలు, జిల్లా స్థాయి సంస్థల మధ్య సమన్వయం సాధించడంతో వాటి పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం వంటి కీలక బాధ్యతలను ఎమ్మెల్సీ నాగబాబు సమర్థవంతంగా నిర్వహిస్తారని మంత్రి దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అటవీ పరిరక్షణ మరియు పచ్చదనాన్ని 50 శాతానికి పెంచడమే ఏపీ గ్రీన్ ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించిన నేపథ్యంలో 2047 నాటికి ఈ లక్ష్యాన్ని సమర్థవంతంగా సాధించే దిశగా నూతన చైర్‌పర్సన్ నాయకత్వంలో కార్యాచరణ కొనసాగాలని అభిప్రాయపడ్డారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ASSOCHAM ప్రతిష్ఠాత్మక “బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్” అవార్డును అందుకున్న APMDC

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *