Breaking News

రేపు కేరళం రాష్ట్రానికి పవన్ కళ్యాణ్

-వైద్యుల సూచన మేరకు భుజానికి ఆయుర్వేద థెరపీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం కేరళం రాష్ట్రానికి వెళ్లనున్నారు. ఇటీవల ముంబైలో కుడి భుజం రొటేటర్ కఫ్ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఆయన, వైద్యుల సూచన మేరకు తదుపరి చికిత్సలో భాగంగా ఆయుర్వేద థెరపీ చేయించుకోనున్నారు.
శస్త్ర చికిత్స అనంతరం వైద్యులు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని తెలిపారు. కొంతకాలం బహిరంగ కార్యక్రమాలు, విధులకి దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు. పాలనా బాధ్యతల దృష్ట్యా వారం రోజుల్లోనే పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయానికి అందుబాటులోకి వచ్చారు. ముందస్తుగా ఖరారైన ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనడం, వరుసగా శాఖాపరమైన సమీక్షలు, పార్టీ అంతర్గత సమావేశాలను నిర్వహించడం చేశారు. ఈ క్రమంలో శస్త్ర చికిత్స చేసిన భుజం భాగంలో వాపు పెరగడంతోపాటు తీవ్రమైన జ్వరం కూడా వచ్చింది. ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు భుజం పూర్తిస్థాయిలో కోలుకునేందుకు కేరళంలో ప్రత్యేక ఆయుర్వేద థెరపీ చేయించుకోనున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎలక్ట్రిక్ బస్సులో ASR అంతర్జాతీయ విమానాశ్రయానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

-ASR అంతర్జాతీయ విమానాశ్రయంలో బస్‌స్టాండ్, చార్జింగ్ స్టేషన్‌ను పరిశీలించిన మంత్రి మండిపల్లి -ప్రతి అరగంటకు ఎలక్ట్రిక్ బస్సు.. మంత్రి మండిపల్లికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *