Breaking News

అన్నవరం ఆర్టీసీ బస్టాండ్‌ను సందర్శించి , ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి..

-అన్నవరం బస్టాండ్‌లో ప్రయాణికులతో మాట్లాడి స్త్రీ శక్తి పథకంపై అభిప్రాయాలు తెలుసుకున్న మంత్రి.
-అన్నవరం బస్టాండ్‌లో మౌలిక సదుపాయాలపైమంత్రి ఆరా
-ఆర్టీసీ కార్మికులతో కలిసి అల్పాహారం చేసిన మంత్రి మండిపల్లి
-సీఎం చంద్రబాబు నాయుడు సారధ్యంలో స్త్రీ శక్తి పథకం అమలు తీరుపై హర్షం వ్యక్తం చేసిన మహిళా ప్రయాణికులు

అన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
అన్నవరం ఆర్టీసీ బస్టాండ్‌ను రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా బస్టాండ్‌లోని మహిళా ప్రయాణికులతో మంత్రి మాట్లాడి, మహిళలకు అమలు చేస్తున్న స్త్రీ శక్తి, ఉచిత బస్సు ప్రయాణ పథకం సంవత్సర కాలం నుండి అమలుపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే బస్టాండ్‌లో ప్రయాణికులకు అందుతున్న మౌలిక సదుపాయాలు, వసతులపై ఆరా తీశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సదుపాయాలు కల్పించాలని అధికారులను సూచించారు. అనంతరం క్యాంటీన్ ను సందర్శించి, ఆర్టీసీ సిబ్బంది డ్రైవర్లు, కండక్టర్ కార్మికులతో కలిసి మంత్రి అల్పాహారం స్వీకరించి, వారితో ఆత్మీయంగా మాట్లాడారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ASSOCHAM ప్రతిష్ఠాత్మక “బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్” అవార్డును అందుకున్న APMDC

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *