Breaking News

మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు నిరంతరం కొనసాగుతోంది

– 5 నౌకలు, 2 డోర్నియర్ విమానాలు, హెలికాప్టర్‌తో విస్తృత సెర్చ్ ఆపరేషన్
– మయన్మార్, పోర్ట్‌బ్లెయిర్, బంగ్లాదేశ్ సరిహద్దు తీరప్రాంత అధికారులకు సమాచారం
– మత్స్యకారులను సురక్షితంగా తీసుకొచ్చే వరకు గాలింపు ఆగదు
– కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలి – మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం భారత తీర రక్షక దళం చేపట్టిన గాలింపు చర్యలు నిరంతరంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. కోస్ట్‌గార్డ్ అసిస్టెంట్ కమాండింగ్ ఆఫీసర్ రంజిత్ కుమార్‌తో సంబంధిత అధికారులు మాట్లాడి సెర్చ్ ఆపరేషన్ పురోగతిని తెలుసుకున్నారని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం 5 నౌకలు, రెండు డోర్నియర్ విమానాలు, ఒక హెలికాప్టర్‌తో సముద్రంలో విస్తృతంగా గాలిస్తున్నట్లు కోస్ట్‌గార్డ్ అధికారులు తెలియజేశారన్నారు. మత్స్యకారుల బోటుకు సంబంధించిన సమాచారాన్ని మయన్మార్, పోర్ట్‌బ్లెయిర్‌తోపాటు బంగ్లాదేశ్ సరిహద్దు తీరప్రాంతాల్లోని కోస్ట్‌గార్డ్ అధికారులకు కూడా చేరవేశారని తెలిపారు. ఆయా ప్రాంతాల్లోనూ బోటు ఆచూకీ కోసం అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం బోటు ఆచూకీ లభించనప్పటికీ, సెర్చ్ ఆపరేషన్‌లో ఎలాంటి విరామం ఉండదని మంత్రి స్పష్టం చేశారు. ఈ నెల 24వ తేదీ తరువాత బాధ్యతలు స్వీకరించే అధికారి కూడా గాలింపు చర్యలను కొనసాగిస్తారని కోస్ట్‌గార్డ్ అధికారులు తెలిపినట్లు వెల్లడించారు. మత్స్యకారులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కోస్ట్‌గార్డ్, నేవీతో నిరంతరం సమన్వయం చేసుకుంటోందని చెప్పారు. కుటుంబ సభ్యులు ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని, బోటు ఆచూకీ లభించే వరకు అన్ని మార్గాల్లో గాలింపు కొనసాగిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎలక్ట్రిక్ బస్సులో ASR అంతర్జాతీయ విమానాశ్రయానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

-ASR అంతర్జాతీయ విమానాశ్రయంలో బస్‌స్టాండ్, చార్జింగ్ స్టేషన్‌ను పరిశీలించిన మంత్రి మండిపల్లి -ప్రతి అరగంటకు ఎలక్ట్రిక్ బస్సు.. మంత్రి మండిపల్లికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *