Breaking News

రూ.221.67 కోట్ల వ్యయంతో ఆసుపత్రులు, కళాశాలల భవన నిర్మాణాలకు శ్రీకారం

-12 చోట్ల పనుల ప్రారంభానికి టెండర్ల ప్రక్రియ ప్రారoభం
-ఇందులో 6 ఆయుష్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు, రెండు వైద్య కళాశాలలు
-మంత్రి సత్యకుమార్ వెల్లడి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆయుష్ వైద్య సేవలు, వైద్య విద్యకు అవసరమైన భవనాల నిర్మాణంతో పాటు అల్లోపతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అదనపు వసతుల కల్పనకు మొత్తం రూ.221.67 కోట్ల అంచనా వ్యయంతో 12 పనులకు టెండర్లను పిలిచినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వీటిలో 10 పనులు ఆయుష్ విభాగానికి, రెండు పనులు అల్లోపతి వైద్య విభాగానికి సంబంధించినవి ఉన్నాయని ఓ ప్రకటనలో వెల్లడించారు.

టెక్కలి నుంచి తిరుపతి వరకు.. ఆరు చోట్ల ఆయుష్ ఆసుపత్రులు

జాతీయ ఆయుష్ మిషన్ (NAM) కింద ఆరు ప్రాంతాల్లో 50 పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రులను నిర్మించనున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో రూ.9.98 కోట్లు, పోలవరం జిల్లా రంపచోడవరంలో రూ.10.57 కోట్లు, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రూ.10.52 కోట్లు, గుంటూరు జిల్లా తెనాలిలో రూ.10.50 కోట్లు, మార్కాపురం జిల్లా గిద్దలూరులో రూ.10.58 కోట్లు, తిరుపతి జిల్లాలో రూ.9.99 కోట్ల అంచనా వ్యయంతో వీటిని ఏర్పాటు చేయనున్నారు.

ప్రొద్దుటూరులో యునాని.. ధర్మవరంలో ఆయుర్వేద కళాశాలలు

కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రభుత్వ యునాని వైద్య కళాశాల ఏర్పాటుకు రూ.49 కోట్ల అంచనా వ్యయంతో, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల ఏర్పాటుకు రూ.49 కోట్లతో భవన నిర్మాణ పనులు చేపట్టనున్నారు.

VIMSలో నేచురోపతి–యోగ కళాశాల.. ఆయుష్ ఆసుపత్రికి అదనపు వసతులు

విశాఖపట్నంలోని VIMS ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ నేచురోపతి, యోగ కళాశాలకు ప్రస్తుతం ఉన్న గ్రౌండ్‌ఫ్లోర్‌పై మొదటి అంతస్తు నిర్మాణానికి రూ.9.37 కోట్లు అంచనా వేశారు. అదే ప్రాంగణంలోని 50 పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రిలో ప్రస్తుత రెండో అంతస్తుపై అదనపు నిర్మాణంతో పాటు కళాశాల క్లినికల్ విభాగానికి అవసరమైన సౌకర్యాల కోసం మూడో అంతస్తు నిర్మాణానికి రూ.3.04 కోట్లు కేటాయించారు.

చింతూరు ఏరియా ఆసుపత్రి.. కాకినాడ జీజీహెచ్‌లో కొత్త ఓపీడీ బ్లాక్ నిర్మాణాలు

చింతూరులోని 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిగా ఉన్నతీకరించేందుకు రూ.21.99 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టనున్నారు. కాకినాడ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో కొత్త రోగుల ఓపీడీ భవనం నిర్మాణానికి రూ.27.13 కోట్ల అంచనా వ్యయాన్ని నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (APMSIDC) ఈ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా టెండర్ల ప్రక్రియ చేపట్టింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ASSOCHAM ప్రతిష్ఠాత్మక “బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్” అవార్డును అందుకున్న APMDC

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *