Breaking News

డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ!

-ఏళ్ల నిరీక్షణకు తెర.. కాంట్రాక్ట్ ఉద్యోగుల చిరకాల స్వప్నం సాకారం
-క్రమబద్ధీకరణకు విశేష కృషి చేసిన NGO రాష్ట్ర నాయకత్వానికి సన్మానం
-ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ప్రభుత్వానికి కాంట్రాక్ట్ ఉద్యోగుల హృదయపూర్వక కృతజ్ఞతలు
-ఎన్జీవో రాష్ట్ర నాయకత్వానికి, ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ (రెగ్యులరైజేషన్) ప్రక్రియ విజయవంతం కావడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తమ చిరకాల స్వప్నాన్ని సాకారం చేసేందుకు అలుపెరగని కృషి చేసిన ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ A. విద్యాసాగర్ గారిని, కాంట్రాక్ట్ ఉద్యోగుల అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం విజయవాడలోని ఎన్జీవో హోమ్‌లో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తమ సమస్య పరిష్కారానికి చొరవ చూపిన నాయకత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు అభినందనలు తెలియజేశారు.

కీలక పాత్ర పోషించిన ‘సాగర్-రమణ’ నాయకత్వం:

ఈ సందర్భంగా డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ… ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాన్ని ఎన్జీవో రాష్ట్ర నాయకత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని కొనియాడారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో అధ్యక్షుడు విద్యాసాగర్ గారు నిరంతరం శ్రమించారని తెలిపారు. వారి ప్రత్యేక చొరవతోనే ముఖ్యమంత్రి ఆమోదం, క్యాబినెట్ ఆమోదం లభించడమే కాకుండా, అసెంబ్లీలో బిల్లు పాస్ అయిందని గుర్తుచేశారు. ఆ తర్వాత డిపార్ట్‌మెంట్ ప్రాసెస్ చట్ట సవరణ (అమెండ్మెంట్) ద్వారా సెకండరీ హెల్త్ కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు మార్గం సుగమమైందని వారు స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్జీవో సంఘం చొరవతో 8000 మంది కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కి మార్గం ముఖ్యమంత్రి ఆమోదంతో సగం అయిందని, ఇప్పుడు యాక్ట్ 30 సవరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం లభించడంతో డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్కు కూడా మార్గం సుగమం అయిందని తెలిపారు.

ముఖ్యమంత్రి, మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు:
ఏళ్ల తరబడి వేచి చూస్తున్న ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపి, వారి కుటుంబాలకు భరోసా కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆర్థిక శాఖమాత్యులు పయ్యావుల కేశవ్ గారికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, శాఖాధికారులకు మరియు సంబంధిత ప్రభుత్వ యంత్రాంగానికి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు సమర్పించారు.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:
ఈ కృతజ్ఞతా కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కరెడ్ల అంజనీ కుమార్, కార్యదర్శి శ్రీదేవి, సహాయ కార్యదర్శితో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి భారీ సంఖ్యలో విచ్చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఎన్జీవో సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ASSOCHAM ప్రతిష్ఠాత్మక “బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్” అవార్డును అందుకున్న APMDC

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *