Breaking News

రేపు అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన

-చోడవరంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం.
-విశాఖలో బ్రిక్స్ యువజన, క్రీడల మంత్రుల సమావేశాలకు హాజరుకానున్న ముఖ్యమంత్రి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో మమేకం కానున్నారు. ఉదయం అమరావతి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం అలమండ గ్రామానికి చేరుకుని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 11.05 గంటలకు ఏ.కొడూరు జెడ్పీ హై స్కూలు సమీపంలోని ప్రజా వేదికకు సీఎం చేరుకుంటారు. మధ్యాహ్నం 1.15 గంట వరకు జరిగే ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2.20 గంటలకు పార్టీ కేడర్‌ సమావేశానికి ముఖ్యమంత్రి హాజరవుతారు. అనకాపల్లి పర్యటన ముగించుకుని విజయనగరం జిల్లా ఎస్.కోటకు సీఎం చేరుకుంటారు. సాయంత్రం 4.20 గంటలకు ఎమ్మెల్యే కె. లలితకుమారి నివాసానికి వెళ్లనున్నారు. అనంతరం విశాఖలో జరుగుతోన్న బ్రిక్స్‌ సదస్సులో పాల్గొంటారు. సాయంత్రం 5.05 గంటలకు నోవాటెల్‌లో జరిగే రెండో బ్రిక్స్‌ యువజన, క్రీడల మంత్రుల సమావేశాలు–2026లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. విశాఖ పర్యటన ముగించుకుని రాత్రికి అమరావతి చేరుకోనున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎలక్ట్రిక్ బస్సులో ASR అంతర్జాతీయ విమానాశ్రయానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

-ASR అంతర్జాతీయ విమానాశ్రయంలో బస్‌స్టాండ్, చార్జింగ్ స్టేషన్‌ను పరిశీలించిన మంత్రి మండిపల్లి -ప్రతి అరగంటకు ఎలక్ట్రిక్ బస్సు.. మంత్రి మండిపల్లికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *