Breaking News

బ్రాహ్మణుల అభివృద్ధికి చంద్రబాబు నాయుడు నాయకత్వం శ్రీరామరక్ష…

-గన్నవరంలో చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ పిలుపు

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో నిర్వహించిన బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ చైర్మన్ కె. బుచ్చి రాంప్రసాద్, సంస్థ ఎండీ చంద్రశేఖర్ ఆజాద్, సీఈఓ నాగ సాయి, డైరెక్టర్ పి.వి. ఫణి కుమార్, కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ విజయవాడ బ్రాంచ్ మేనేజర్ గోర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి గన్నవరం నియోజకవర్గానికి చెందిన బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా చైర్మన్ కె. బుచ్చి రాంప్రసాద్ మాట్లాడుతూ, బ్రాహ్మణుల సంక్షేమం, ఆత్మగౌరవం, ఆర్థిక అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని కొనియాడారు. బ్రాహ్మణుల అభివృద్ధికి చంద్రబాబు నాయుడు నాయకత్వం శ్రీరామరక్ష అని, బ్రాహ్మణ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి, సంక్షేమ కార్యక్రమాలకు సంస్థాగత రూపం కల్పించిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు దేనని అన్నారు. బ్రాహ్మణ సమాజ అభ్యున్నతి కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎంతోమంది కుటుంబాలకు అండగా నిలిచాయని పేర్కొన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని చైర్మన్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాహ్మణ సంక్షేమ కార్యక్రమాలకు మళ్లీ ప్రాధాన్యత లభించిందని అన్నారు. 2019–2024 మధ్య రాష్ట్రంలో జరిగిన పాలనను ప్రజలు ప్రత్యక్షంగా చూశారని, ఆ పాలనకు స్వస్తి పలికి కూటమి ప్రభుత్వానికి ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని చైర్మన్ పేర్కొన్నారు. గత పాలనలో నిర్వీర్యమైన సంక్షేమ వ్యవస్థలకు మళ్లీ ఊపిరి పోసి, బ్రాహ్మణ సమాజానికి తగిన ప్రాధాన్యత కల్పించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా బ్రాహ్మణ కుటుంబాలకు ఆర్థిక సహకారం, రుణ సదుపాయాలు అందిస్తూ స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబనకు ప్రోత్సాహం కల్పిస్తున్నామని చెప్పారు. అవసరమైన వారికి రుణ సదుపాయాలు అందించి వారి ఆర్థిక పురోగతికి సంస్థ కృషి చేస్తోందని తెలిపారు.

గన్నవరం శ్రీ గాయత్రి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు…

నారా చంద్రబాబు నాయుడు బ్రాహ్మణ సంక్షేమ కృషికి కృతజ్ఞతగా గన్నవరం గ్రామంలోని గాయత్రి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నారా చంద్రబాబు నాయుడు పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆయనకు ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు, మరింత శక్తి ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో బ్రాహ్మణులు పాల్గొని తమ కృతజ్ఞతను చాటుకున్నారు. బ్రాహ్మణ సమాజ సంక్షేమం కోసం నారా చంద్రబాబు నాయుడు చేపడుతున్న కార్యక్రమాలకు బ్రాహ్మణ సమాజం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నాయకులు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో, మంత్రి నారా లోకేష్ యువ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తోందని చైర్మన్ తెలిపారు. బ్రాహ్మణ సమాజం కూడా ప్రభుత్వానికి అండగా నిలిచి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. గన్నవరం నియోజకవర్గ బ్రాహ్మణులు తమ సమస్యలు, సూచనలను చైర్మన్ దృష్టికి తీసుకురాగా, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గన్నవరం నియోజకవర్గ బ్రాహ్మణ పెద్దలు, యువత, మహిళలు, వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ASSOCHAM ప్రతిష్ఠాత్మక “బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్” అవార్డును అందుకున్న APMDC

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *