Breaking News

గుమ్మిడిపూండి, గూడూరు 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం

-కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన తిరుపతి ఎంపీ డా. మద్దిల గురుమూర్తి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
గుమ్మిడిపూండి–గూడూరు మధ్య 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల తిరుపతి ఎంపీ డా. మద్దిల గురుమూర్తి హర్షం వ్యక్తం చేశారు. ఈ కీలక ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ కి ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు ఉన్న రెండు లైన్లకి అదనంగా మరో రెండు లైన్లు నిర్మించానున్నారని ఎంపీ తెలిపారు.

ఈ ప్రాజెక్టు మొత్తం 90 కిలోమీటర్ల పొడవుతో, రూ.2,229 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్నారని ఆయన తెలియజేశారు. ఈ పనులను నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ రైల్వే లైన్ల నిర్మాణంతో చెన్నై, గూడూరు, రేణిగుంట మార్గంలో రైళ్ల రద్దీ తగ్గడంతో పాటు ప్రయాణికులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఎంపీ తెలిపారు. ముఖ్యంగా గూడూరు చెన్నై, విజయవాడ, రేణిగుంటలను అనుసంధానించే కీలక రైల్వే జంక్షన్ కావడంతో ఈ ప్రాజెక్టుకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు.

ఈ ప్రాజెక్టులో స్వర్ణముఖి నదిపై 360 మీటర్ల మెగా బ్రిడ్జితో పాటు 21 ప్రధాన వంతెనలు, 127 చిన్న వంతెనలు, 34 రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు, రోడ్డు అండర్ బ్రిడ్జ్లు నిర్మించనున్నారని తెలిపారు. అదనపు సరుకు రవాణా సామర్థ్యం పెరగడం ద్వారా సిమెంట్, కంటైనర్లు, యంత్రాలు, ఆహార ధాన్యాలు, ఇనుము, ఉక్కు వంటి సరుకుల రవాణాకు మరింత వెసులుబాటు కలుగుతుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు ప్రాంతాల రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి, పారిశ్రామిక మరియు ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలకు దోహదపడుతుందని ఎంపీ డా. మద్దిల గురుమూర్తి అన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కీలక రైల్వే ప్రాజెక్టుకు ఆమోదం తెలిపినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ASSOCHAM ప్రతిష్ఠాత్మక “బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్” అవార్డును అందుకున్న APMDC

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *