Breaking News

నిర్లక్ష్యం వల్లే కేంద్రానికి చిక్కులు

-విద్యా వ్యవస్థలో సమగ్ర మార్పులు అవసరం
-మీట్ ది ప్రెస్ లో జెన్ జీ ఉద్యమ నేత నేహా బోరా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నీట్ పరీక్ష పేపర్ లీక్ కావటం, పరీక్షను రద్దు చేయటం వంటి అంశాలు కంటే ప్రభుత్వం బాధ్యతగా, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు, యువత అడిగిన అంశాలపై స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్లే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చిక్కుల్లో పడిందని ఏఐఎస్ఏ జాతీయ అధ్యక్షురాలు, జెన్ జీ ఉద్యమ నేత నేహా బోరా అన్నారు. ఏపీయూడబ్ల్యూజే విజయవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఐజేయూ కార్యవర్గ సభ్యులు కూన అజయ్ బాబు సమన్వయ కర్తగా వ్యవహరించారు. నేహా బోరా మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్ధేశ్యం కేంద్రానికి లేదన్నారు. దిల్లీలోని జంతర్ మంతర్‌లో ఉద్యమం జరుగుతున్నా, నిరాహార దీక్షలో కూర్చున్న తమపై విద్వేషం రెచ్చగొట్టాలని ప్రయత్నించారు గాని సమస్యలపై మాట్లాడేందుకు స్పందించలేదన్నారు. లెక్కలేని తనం, వ్యంగ్యంగా వ్యవహరించారని విమర్శించారు. విద్యార్థులు ప్రాణత్యాగానికి సిద్ధపడి దీక్ష చేస్తుంటే తల్లిదండ్రులు తమకు సంఘీభావంగా వచ్చిన వారు తమలో ఉన్న బాధను వ్యక్తం చేశారని, ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను తమతో చర్చించారని చెప్పారు. దీంతో తాము అధికారంలో ఉన్న బీజేపీ కళ్లుతెరిపించేందుకు పోరాటాల ద్వారా ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఉద్యమంలో బీజేపీ ఆరఎస్ఎస్ జోక్యం చేసుకుని రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నించటం వల్లనే దీక్ష ఎక్కువ కాలం కొనసాగిందన్నారు.. దిల్లీ పోలీస్ కమీషనర్ దీక్షలో ఉన్న సోనం వాంగుచుక్‌ను బలవంతంగా ఆసుపత్రికి తరలించే సందర్భంలో ఆరు అంచెలుగా మానవహారం ఏర్పాటు చేసి అడ్డుకునేందుకు ప్రయత్నించటం జరిగిందన్నారు. 60ఏళ్ల వాంగ్‌చుక్‌కు వ్యక్తిగత అంశాలు ఏవి లేవని, కేవలం విద్యార్థులకు న్యాయం జరగాలనే ఆయన దీక్ష చేశారని తెలిపారు. పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేయటానికి ఏలాంటి కారణం చూపలేదన్నారు. ప్రజలకు సేవలందించాల్సిన పోలీసులు మత, సాంస్కృతిక అంశాలతో ఉద్యమ వాతావరణాన్ని కలుషితం చేశారని ఆరోపించారు. దిల్లీలో జులై 20వ తేదిన ఏమి జరిగిందో యావత్తు ప్రపంచం చూస్తుండటంతో ప్రభుత్వం చేతులేత్తేసిందన్నారు. విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సమస్య పరిష్కారం కాదని అర్థమయిందన్నారు. మహిళలు, దళితులు, మైనర్లపై కేసులు నమోదు చేయటంతో నిరాహార దీక్ష కేవలం మంత్రి రాజీనామా కోసం కాదని, పూర్తి భావజాలాన్ని మార్చాలనే నిర్ణయానికి వచ్చామని చెప్పారు. విభజన రాజకీయాలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వం స్వాతంత్ర సమరయోధుల ఆశయాలకు విరుద్ధంగా వ్యవహరించటం దారుణం అన్నారు. ఈ వ్యవస్థను సమూలంగా పెకలించాల్సిన అవసరం ఉందన్నారు.
అనంతరం జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు నేహా సమాధానం చెపుతూ ఆంధ్రప్రదేశ్‌లో స్పోర్ట్స్ కోటాలో ఎంత శాతం కేటాయించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. పేపర్ లీకేజ్, మాస్ కాపీయింగ్, సీసీ కెమెరాల పుటేజ్ అంశాలపై దర్యాప్తు చేయాలన్నారు. రాజకీయ పార్టీలు విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఆటలాడుతున్నాయని పేర్కొన్నారు. ప్రైవేటీకరణ, కేంద్రీకరణ, ఎస్ఈపీ వంటి చెత్తపనులు మానుకోవాలని సూచించారు. జాతీయ పరీక్ష సంస్థ (ఎన్‌టీఏ) ఏర్పాటులో లోపాలు ఉన్నాయని తెలిపారు. ఎన్‌టీఏలో ప్రభుత్వానికి అనుకూలంగా పని చేసే వ్యక్తులు ఉన్నారని పేపర్ లీక్‌లకు వారే కారణమని స్పష్టం చేశారు. సీపీఐ(ఎంఎల్) పార్టీ ఎనిమిది గంటల పని విధానం, రైతులకు సంబంధించిన మూడు నల్ల చట్టాలు తీసుకురావటం వంటి చర్యలను ఖండించిందన్నారు. దేశాన్ని కొత్త తరహాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తుందని వివరించారు.
ఈ సందర్భంగా నేహా బోరాను ఏపీయూడబ్ల్యూజే తరుపున ఘనంగా సత్కరించారు.
కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ అధ్యక్షుడు చావా రవి, ఐజేయూ కౌన్సిల్ సభ్యుడు షేక్ బాబు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ASSOCHAM ప్రతిష్ఠాత్మక “బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్” అవార్డును అందుకున్న APMDC

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *