Breaking News

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి… : వడ్లమూరి కృష్ణ స్వరూప్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దళిత క్రైస్తవులను తిరిగి ఎస్సీ జాబితాలో చేర్చి, ఎస్సీ రిజర్వేషన్లు ఇతర రాజ్యాంగ హక్కులు కల్పించాలని దళిత క్రిస్టియన్ ఫోర్స్ (డీసీఎఫ్) జాతీయ చీఫ్ అడ్వైజర్ సుప్రీంకోర్టు అడ్వకేట్ సంస్థ వ్యవ స్థాపకుడు వడ్లమూరి కృష్ణ స్వరూప్, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం విజయవాడ గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో డీసీఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని క్లాజ్–3 కారణంగా ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తులు క్రైస్తవ మతాన్ని స్వీకరించినప్పుడు ఎస్సీ హోదా రిజర్వేషన్లు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని కృష్ణ స్వరూప్, పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25 ప్రతి పౌరుడికి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించే ఆచరించే స్వేచ్ఛ కల్పిస్తుందని అయితే మతం మారిన కారణంగా దళిత క్రైస్తవులు హక్కులు కోల్పోవడం వివక్షకు దారితీస్తోందని అన్నారు.
1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌లోని క్లాజ్–3ను పార్లమెంటులో చట్ట సవరణ ద్వారా రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దళిత క్రైస్తవులు చర్చిలు పాస్టర్లపై జరుగుతున్న దాడులను అరికట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చర్చిలు పాస్టర్లు క్రైస్తవ సమాజానికి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని కోరారు. దళిత క్రైస్తవుల సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం ప్రత్యేకంగా దళిత క్రిస్టియన్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం దళిత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. దళిత క్రైస్తవుల ఆత్మగౌరవం ఆత్మరక్షణ సామాజిక న్యాయం రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం డీసీఎఫ్ నిరంతరం ఉద్యమిస్తుందని తెలిపారు. నగర అసెంబ్లీ జిల్లా స్థాయిల్లో సమావేశాలు నిర్వహించిన అనంతరం విజయవాడలో వేలాది మందితో భారీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రార్థనలతో పాటు హక్కుల సాధన కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో సంఘటితమై పోరాడాలని దళిత క్రైస్తవ సమాజానికి పిలుపునిచ్చారు.
సమావేశంలో డీసీఎఫ్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆరే దైవకృప మల్లెం గౌరవ అధ్యక్షుడు బి. డేవిడ్ రత్నకుమార్ జనరల్ సెక్రటరీ సుదర్శనం అజయ్ అడ్వైజర్ దిడ్ల విద్యాసాగర్ వర్కింగ్ ప్రెసిడెంట్లు జెఎన్వి రాజారావు వి. సతీష్ పాల్ వైస్ ప్రెసిడెంట్ ఎంఎస్ అరుణ లతకుమారి ఆర్గనైజింగ్ సెక్రటరీ జి. కరుణ ట్రెజరర్ బి. రమేష్ ఎం. ప్రసన్నకుమార్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు చింతయ్య తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ASSOCHAM ప్రతిష్ఠాత్మక “బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్” అవార్డును అందుకున్న APMDC

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *