అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 26,27 తేదీల్లో అసెంబ్లీ కమిటీ హాల్లో ఆంధ్రప్రదేశ్ శాసన సభ పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ సమావేశం కానుందని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ తెలియజేశారు.ఈకమిటీ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థల(పబ్లిక్ అండర్ టేకింగ్స్(పిఎస్ యులు)కు సంబంధించి గత ఐదేళ్ళ వార్షిక నివేదికలు మరియు జనరల్ యాక్టివిటీలను సమీక్షించ నుందని పేర్కొన్నారు.ఈనెల 26వ తేదీన ఉ.10గం.లకు అసెంబ్లీ కమిటీ హాల్ 1లో ఎపి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(ఎపిఐఐసి),ఎపి స్టేట్ రోడ్డు రవాణా సంస్థ(ఎపిఎస్ఆర్టీసి),ఎపి స్టేట్ హేండ్ లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటి(ఆప్కో) లపై అసెంబ్లీ పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ సమీక్షిస్తుందన్నారు.అదే విధంగా మధ్యాహ్నం 2గం.ల నుండి ఎపి ఖాదీ వివేజ్ ఇండస్ట్రీస్ బోర్డు(ఎపి కెవిఐబి),ఎపి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లపై సమీక్షిస్తుందని తెలిపారు.
27వ తేది గురువారం ఉ.10గం.లకు సమగ్ర శిక్ష,ఎపి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజిమెంట్ లిమిటెడ్ లపైన,మధ్యాహ్నం 2గం.లకు ఎపి స్టేట్ డిజాస్టర్ మేనేజిమెంట్ అధారిటి పైన తదుపరి ఎపి ఎడ్యుకేషన్ అండ్ వెల్పేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎపిఇడబ్ల్యుఐడిసి)లపైన అసెంబ్లీ కమిటీ సమీక్షిస్తుందని సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ తెలియజేశారు.
Tags amaravathi
Check Also
ASSOCHAM ప్రతిష్ఠాత్మక “బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్” అవార్డును అందుకున్న APMDC
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ …
Prajavartha Online Telugu News