Breaking News

నీకు సీబీఐపై నమ్మకం ఉందా..?

-జగన్ పై మంత్రి సవిత నిలదీత
-ఆనాడు వివేకా హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు ఎందుకు వద్దన్నావ్..?
-చెల్లెలు సునీత డిమాండ్ ను కూడా పట్టించుకోలేదు కదా…
-నీతీరు దొంగే దొంగ అన్నట్లుంది…
-గ్రూప్ 1 మూల్యాంకనం అక్రమాలు బయటపడడంతో డైవర్షన్ రాజకీయాలు
-అసెంబ్లీలో చర్చకు ఎందుకు రాలేదు…?
-మెగా డీఎస్సీ అభ్యర్థుల కష్టాన్ని తక్కువ చూసి చూడొద్దు
-జగన్ తాటాకు చప్పుళ్లకు ఎవరూ బెదిరిపోరు
-రాబోయే రోజుల్లో మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ : మంత్రి సవిత

పెనుకొండ/శ్రీసత్యసాయి, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రూప్ 1 లో జరిగిన అక్రమాలపై బయటకు పొక్కడంతో మెగా డీఎస్సీ నిర్వహణపై జగన్ దొంగే దొంగ అన్నట్లు ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత మండిపడ్డారు. మెగా డీఎస్సీ అభ్యర్థుల ఆత్మగౌరవం దెబ్బతినేలా మాట్లాడుతున్న జగన్ కు చట్టాలపైనా, సీబీఐపైనా నమ్మకం ఉందా..? అని ప్రశ్నించారు. డీఎస్సీలోపై తప్పుడు ఆరోపణలు చేయడం కాదని, అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సవాల్ చేసినా ఆయన ముఖం చాటేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. యువతకు ఉద్యోగాలే కల్పనే లక్ష్యంగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఇచ్చిన మాటకు కట్టుబడి జాబ్ క్యాలెండర్ అమలు చేస్తూ, కూటమి ప్రభుత్వం ఏటా ఉద్యోగాలు భర్తీ చేస్తుందని స్పష్టం చేశారు. మెగా డీఎస్సీలో టీచర్ పోస్టు సాధించిన పెనుకొండకు చెందిన టీచర్లు జ్యోతి, గంగాధర్ ఇళ్లకు శుక్రవారం వెళ్లి వాళ్లతో మాట్లాడారు. అనంతరం మహిళా టీచర్ జ్యోతితో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. మెగా డీఎస్సీలో ఎటువంటి అక్రమాలు జరగలేదనడానికి తన పక్కనున్న మహిళా టీచరే ఉదాహరణ అని అన్నారు. డీఎస్సీలో రెండు పోస్టులకు ఆమె క్వాలీఫై అయ్యిందన్నారు. ఆమె తమ్ముడు కూడా డీఎస్సీ అర్హత పరీక్ష రాసినా, ఉత్తీర్ణత సాధించలేకపోయారన్నారు. మెగా డీఎస్సీ పారదర్శకతను ఈ అక్కా తమ్ముడే నిదర్శనమన్నారు. జగన్ తాటాకు చప్పుళ్లకు కూటమి ప్రభుత్వం బెదిరిపోదని, రాబోయే రోజుల్లో మరిన్ని ప్రభుత్వ, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు. డీఎస్సీ అంటే సీబీఎన్ అని, సీబీఎన్ అంటే డీఎస్సీ అని మంత్రి సవిత స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మెగా డీఎస్సీని అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించామని తెలిపారు. అభ్యర్థులు ఎలాంటి అపోహలకు, భయాలకు గురికాకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు. టీచర్ల కష్టానికి దక్కిన ఈ విజయం వారికి గర్వకారణమని, కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి సవిత భరోసా ఇచ్చారు.

గ్రూప్ 1 లో అక్రమాలతో జగన్ డ్రామాలు

తన హయాంలో జరిగిన గ్రూప్ 1 పరీక్షలో మూల్యాంకనంలో జరిగిన తప్పిదాల నుంచి బయటపడడానికి జగన్ మెగా డీఎస్సీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి సవిత మండిపడ్డారు. దొంగే దొంగ అన్నట్లు మెగా డీఎస్సీపై జగన్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. భర్త, పిల్లలకు, కుటుంబానికి దూరంగా ఉంటూ, అనంతపురంలో మెగా డీఎస్సీపై శిక్షణ పొందారన్నారు. వారి కష్టాన్ని తక్కువ చేస్తూ.. మెగా డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల మనోభావాలు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా జగన్ మాట్లాడడం సరికాదన్నారు. జగన్ కు చట్టాలపైనా, సీబీఐపైనా మ్మకం ఉందా..? అని ప్రశ్నించారు. వైఎస్ వివేకా హత్య కేసులో తొలుత సీబీఐ దర్యాప్తు కోరిన జగన్, అధికారంలోకి రాగానే ఎందుకు మాటమార్చారని ప్రశ్నించారు. బాబాయ్ కూతురు, చెల్లెలు వైఎస్ సునీత ఎన్ని పర్యాయాలు కోరినా, వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు అవసరంలేదని చెప్పలేదా..? అని నిలదీశారు. బయటకూర్చొని మాట్లాడడం సరికాదని, అసెంబ్లీ వేదికగా చర్చ జరిపి ఉంటే వాస్తవాలు ప్రజలకు తెలిసేవని మంత్రి అన్నారు.

మా మనస్సులను బాధపెట్టొద్దు : మహిళా టీచర్ జ్యోతి

‘పెనుకొండలో టీచర్ గా పనిచేస్తున్నానని, నా పిల్లల సాక్షిగా చెబుతున్నా… తాను కష్టపడి మెగా ఎస్సీలో ఉద్యోగం సాధించానని’ మహిళా టీచర్ తెలిపారు. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగి ఉంటే తనతో పాటు తన తమ్ముడికీ ఉద్యోగం సంపాదించేవాళ్ల కదా..? అని పశ్నించారు. మెగా డీఎస్సీ కోసం ఎంతో కష్టపడి చదవానని, తాను రెండు పోస్టులకు అర్హత సాధించానని తెలిపారు. తమ కష్టాన్ని తక్కువ చేసి మాట్లాడడం సరికాదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలా తమ మనస్సులు బాధపెట్టడం సరికాదని జగన్ నుద్దేశించి మహిళా టీచర్ జ్యోతి కోరారు. అనంతరం గంగాధర్ మాట్లాడుతూ.. తాను వ్యవసాయ కుటుంబానికి చెందినవాడినని, అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ డీఎస్సీకి సిద్ధమయ్యానని తెలిపారు. కుటుంబ బాధ్యతలను చూసుకుంటూనే ఎంతో కష్టపడి ఉద్యోగాన్ని సాధించానన్నారు. బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా అందించిన డీఎస్సీ కోచింగ్ తనకు ఎంతో ఉపయోగపడిందని గంగాధర్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ASSOCHAM ప్రతిష్ఠాత్మక “బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్” అవార్డును అందుకున్న APMDC

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *