Breaking News

మూలపాడులో క్రికెట్ క్రీడా పోటీలు ప్రారంభించిన విజయవాడ పోలీస్ కమిషనర్ ఎమ్మెల్యే వసంత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ఉద్యోగుల ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ క్రీడా పోటీలకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. యునైటెడ్‌ తెలుగు జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక పోటీలను మూలపాడులోని ఏసీఏ స్టేడియంలోవిజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ,మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌ ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు జరిగిన మ్యాచ్ లో మొదటిగా గ్రౌండ్ ఏ లో ఇరిగేషన్ ఏ, ఇరిగేషన్ బి టీ పోటీ పడ్డాయి. గ్రౌండ్ బి లో ఎడ్యుకేషన్, రెవిన్యూ మొదటి మ్యాచ్ ముగించారు. రెండో మ్యాచ్ వచ్చేసరికి ఏ గ్రౌండ్ లో పంచాయతీరాజ్, సెక్రటేరియట్ స్ట్రైక్ , బి గ్రౌండ్ లో ఏపీ ఎన్జీవో టు వర్సెస్ విఎంసి XI ఆడగా ఉదయం జరిగిన ఆమ్యాచ్ లో ఇరిగేషన్ బి గెలుపొందారు. బి గ్రౌండ్ లో ఎడ్యుకేషన్ టీం గెలుపొందారు. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్ లో ఏ గ్రౌండ్ లో పంచాయతీరాజ్ గెలుపొందారు. బి గ్రౌండ్ లో విఎంసి గెలుపొందారు. రేపు ఉదయం ఏపీ ఎన్జీవో 1, సెక్రటేరియట్ స్ట్రైకర్, టీములు మ్యాచ్ ఆడనున్నాయి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ASSOCHAM ప్రతిష్ఠాత్మక “బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్” అవార్డును అందుకున్న APMDC

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *