ప్రత్యేక సమగ్ర సవరణ (SIR–2026)పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
80–విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR–2026) ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం ఉదయం విజయవాడ నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమిషనర్ చాంబర్ వద్ద గల సమావేశం రూమ్ లో సెంట్రల్ ఈఆర్వో మరియు విఎంసి కమిషనర్ ధ్యానచంద్ర సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ, SIR–2026లో భాగంగా చేపట్టిన ఇంటింటి సర్వే, ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురణ, క్లెయిమ్స్–అభ్యంతరాల స్వీకరణ, విచారణ, పరిష్కారం తదితర అంశాలపై వివరించారు. క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణకు 30 ఆగస్టు 2026 వరకు గడువు ఉన్నందున, అర్హత కలిగిన ఓటర్లు తమ వివరాలను పరిశీలించుకోవాలని, అవసరమైన సవరణలు లేదా అభ్యంతరాలను నిర్ణీత విధానంలో సమర్పించాలని కమిషనర్ సూచించారు. ఎస్ ఐ ఆర్ 2026 లో భాగంగా బూత్ లెవెల్ ఏజెంట్లు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా వారి పత్రాలు అన్నారు.

ERO, AERO లాగిన్లలో ఇప్పటివరకు 8,900 హియరింగ్స్ పూర్తయినట్లు కమిషనర్ తెలిపారు. పూర్తయిన హియరింగ్స్‌కు సంబంధించిన వివరాలను సిస్టమ్‌లో సక్రమంగా నమోదు చేసి, మిగిలిన పెండింగ్ అంశాలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కొంతమంది BLOలు ఇప్పటికీ ఎన్్యూమరేషన్ ఫారాలను సేకరించలేదని పార్టీ ప్రతినిదులు సమావేశంలో ఈఆర్వో దృష్టికి తీసుకురాగా ఫారాల సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు కమిషనర్ ఆదేశించారు.

ఓటర్ల వివరాల్లో గుర్తించిన 9 డిస్క్రెపెన్సీలు మరియు సుమారు 36,000 వ్యాకరణ/స్పెల్లింగ్ తప్పుల స్థితిని కూడా సమావేశంలో సమీక్షించారు. సంబంధిత ఓటర్ల నుంచి అవసరమైన ఆధారాలు సేకరించి వివరాలను ధృవీకరించాలని, BLOలు అవసరమైన డిక్లరేషన్లు సమర్పించాలని, AEROs క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు.

అలాగే SIR ప్రక్రియలో క్షేత్రస్థాయిలో గుర్తించిన అసంపూర్ణ సమాచారం, వివరాల్లో వ్యత్యాసాలు, నమోదు చేసిన డేటాలోని తప్పులను AEROలు క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత రికార్డులతో సరిపోల్చి అవసరమైన సవరణలు చేయాలని సూచించారు.

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా మరియు నిర్ణీత గడువులో పూర్తయ్యేలా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, BLOలు, AEROs మరియు సంబంధిత అధికారులు సహకరించాలని ఈఆర్వో మరియు విఎంసి కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ ఎం కోరారు.

ఈ సమావేశంలో AERO లు కె. దుష్యంత్, కె. ప్రభుదాస్, కె. లక్ష్మి, మరియు రాజకీయ పార్టీ ప్రతినిధులు ఎస్ ఏ అన్సారీ (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ), ఎన్ వీరభద్రరావు (కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా), బి రమణ (సిపిఐ(ఎం )), ఎన్ వెంకట్ భారతీయ (జనతా పార్టీ), ఎం సాంబశివరావు (టిడిపి), జి సుందర్ పాల్ (వైఎస్ఆర్సిపి), బి వంశీకృష్ణ (జనసేన పార్టీ), పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *