ఘనంగా ‘జష్నే ఈద్ మిలాదున్నబీ’ భారీ ర్యాలీ కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పంజా సెంటర్‌లో ఘనంగా ‘జష్నే ఈద్ మిలాదున్నబీ’ భారీ ర్యాలీ కార్యక్రమం జరిగింది. పంజా సెంటర్ నుంచి ర్యాలీ బయల్దేరి కాలేశ్వరం మార్కెట్ జామియామసీదు వరకుసాగింది వేలాది మంది ముస్లిం సోదరులు సోదరిమణులు పాల్గొన్నార. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాజీ బాబా మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జీవితం మానవాళికి శాంతి, దయ, సమానత్వం మరియు పరస్పర సోదరభావాన్ని నేర్పుతుందని పేర్కొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎల్లప్పుడూ సర్వమత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని, అన్ని పండుగలను అందరూ ఐక్యంగా జరుపుకోవడం ఇక్కడి విశిష్ట సంప్రదాయమని కొనియాడారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మైనారిటీల పట్ల ప్రేమాభిమానాలతో పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జిమాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ముస్లిం సోదరీమణులు సోదరులకు అందరికీ మీలా దున్నభి శుభాకాంక్షలు తెలియజేశారు .
​ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ షేక్ బాజీ. రాష్ట్ర హిస్టరీ మాజీ డైరెక్టర్ వాజిద్ ఖాన్ ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముక్టియర్. ముస్లిం సమైక్యవేదిక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. మహమ్మద్ నూర్ ఖాన్ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో వేలాదిగా ముస్లింసోదరులు సోదరీమణులు పాల్గొన్నారు. అనంతరం దేశంలో శాంతి, సమృద్ధి నెలకొనాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *