బాధిత కుటుంబానికి ఎల్ ఓ సీ అందజేత..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిది నుంచి మంజూరైన ఎల్ ఓ సీ ను బాధిత కుటుంబానికి భవాని పురం ఎన్డీయే కార్యాలయలో అందజేశారు. వించిపేటకు చెందిన ఎల్ కిరణ్ ( 40)ప్యాంక్రియాటైటిస్ తో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి మరింత మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు తెలపడంతో ఎన్డీయే కార్యాలయంలో వైద్య సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 4 లక్షల 50 వేల విలువైన ఎల్ ఓ సీ ను టీడీపీ సీనియర్ నాయకులు కొణిజేటి రమేష్ బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీ ను అందజేసిన ఎమ్మెల్యే సుజనా కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సుజనా మిత్రా కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *