మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సీ అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్. ఓ. సి ) లను జారీ చేస్తున్నారు.ఎమ్మెల్యే సుజనా ,ఆదేశాలతో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య,42 వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షురాలు తిరుపతి అనూష తో కలిసి భవానిపురం, ఎన్డీయే కార్యాలయంలో బాధిత కుటుంబానికి ఎల్ ఓ సీను అందజేశారు. హెచ్ బీ కాలనీ కు చెందిన చలవాది సత్యనారాయణ (55) హెర్నియా తో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 5.18 లక్షల ఎల్ ఓ సీ ను అందజేశారు. త్వరితగతిన స్పందించి
ఎల్ ఓ సీ ను అందజేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సుజనా న్యాయ మిత్రా బాయన హేరంబ కుమార్, టీడీపీ డివిజన్ ప్రధాన కార్యదర్శి పచ్చవ మల్లికార్జునరావు, సుజనా మిత్రా కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *