శ్రీ లక్ష్మీదేవి అలంకరణలో భక్తులను అలరించిన శ్రీ మహంకాళి అమ్మవారు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానంలో శ్రీ మహంకాళి అమ్మవారు శ్రావణమాసం మూడో శుక్రవారం శ్రీ అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా శ్రీ లక్ష్మీదేవి అలంకరణలో భక్తులకి దర్శనం ఇచ్చారు. శుక్రవారం కంఠంరాజు కొండూరు గ్రామం, దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లాలో కొలువై ఉన్న ప్రసిద్ధ అధ్యాత్మిక పుణ్యక్షేత్రం శ్రీ మహంకాళి అమ్మవారు శ్రావణమాస ఉత్సవాల సందర్భంగా శక్తిస్వరూపిణి అయిన అమ్మవారు శ్రీ లక్ష్మీదేవి అలంకరణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా వేదమంత్రాల సాక్షిగా జరుపుకోవడం జరిగింది. ఈ వేడుకలు భక్తుల కోలాహలంతో, మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. గుడి ప్రాంగణం మొత్తం అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. ఆలయ కార్యనిర్వాహణాధికారి కోగంటి సునీల్ కుమార్ మాట్లాడుతూ శ్రావణమాస ఉత్సవాలు మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపడతాయన్నారు. భక్తులు శ్రావణ లక్ష్మీవ్రతం నిర్వహించి శ్రావణమాసంలో అమ్మవారిని కోరుకున్న కోరికలను తీర్చే కొంగు బంగారు తల్లి అమ్మవారు తప్పక నెరవేరుస్తుంది అనే నమ్మకం అన్నారు. భక్తులకు అన్ని వసతులు కల్పించడంలో కమిటీ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారన్నారు.
అధ్యాత్మికతను మెరుగుపరిచేందుకు ఆలయ ఆవరణం అభివృద్ధి, ఆలయ గోపురం ఆధునికీకరణ చేయడంతో పాటు భక్తుల సౌకర్యార్థం తదితర అవసరమైన మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. వేలాదిగా విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ గావించామన్నారు. వ్యవస్థాపక ధర్మకర్త డి.రంగ ప్రసాద్, సిబ్భంది బి.రాజేష్ తదితరులు పర్యవేక్షించారు. ముఖ్య అర్చకులు సుబ్రమణేశ్వర శర్మ, అర్చకులు దేవమణి కృష్ణ శర్మ భక్తులకు ఆశీర్వచనం చేసి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *