మర్యాద పూర్వక కలయిక

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నూతనంగా ఎన్నికైన శ్రీ విజయేశ్వర స్వామి దేవాలయం నూతన పాలకమండలి సభ్యులు ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ను భవానీపురం ఎన్డీయే కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మరియు కమిటీ సభ్యులకు ప్రత్తిపాటి శ్రీధర్ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. వారి నేతృత్వంలో శ్రీ విజయేశ్వర స్వామి దేవాలయం మరింత ఆధ్యాత్మిక శోభతో, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ప్రత్తిపాటి శ్రీధర్ ఆకాంక్షించారు. శ్రీ విజయేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ దరిశి సీతా మహా లక్ష్మి, కమిటీ సభ్యులు యర్రంశెట్టి విశ్వేశ్వరరావు, ఆలమూరి శ్రీదేవి, బండారు బాబురావు, రత్నావత్ హారతి, చింతపల్లి సత్యనారాయణ, పెళ్ళూరి మణిమాల, నక్క కృష్ణ, అడ్డూరి శివకుమారి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *