నీట్ పీజీ ప‌రీక్ష‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు..

– ప‌రీక్షా కేంద్రాన్ని త‌నిఖీ చేసిన జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 30వ తేదీ ఆదివారం జ‌రిగే నీట్ పీజీ-2026 ప‌రీక్ష‌ను స‌జావుగా జ‌రిగేందుకు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేయ‌డం జ‌రిగింద‌ని.. ఎక్క‌డా ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌క్కుండా ఉండేందుకు చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు జిల్లా క‌లెక్డ‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు.
విజ‌య‌వాడలో పీఎస్‌సీఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజ‌నీరింగ్ అండ్ టెక్నాల‌జీ, శ్రీ విజ‌య‌దుర్గ ఐటీ ఇన్ఫో సొల్యూష‌న్స్ (ఎనికేపాడు) కేంద్రాల్లో ప‌రీక్ష జ‌ర‌గ‌నుంది. మొత్తం 843 మంది అభ్య‌ర్థులు ప‌రీక్ష‌రాసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నేప‌థ్యంలో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ శనివారం పీఎస్‌సీఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజ‌నీరింగ్ అండ్ టెక్నాల‌జీ ప‌రీక్షా కేంద్రాన్ని త‌నిఖీ చేశారు. ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌కు చేసిన ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. ప‌రీక్ష కేంద్రాల వ‌ద్ద వైద్య శిబిరాల‌తో పాటు ఇత‌ర సౌక‌ర్యాల క‌ల్ప‌నను ప‌రిశీలించారు. భద్రత, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర ఏర్పాట్లు స‌రైన విధంగా ఉండేలా అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. ఉద‌యం 9 గంట‌ల నుంచి 12.30 గంట‌ల వ‌ర‌కు జ‌రిగే కంప్యూట‌ర్ ఆధారిత పరీక్షను పారదర్శకంగా, ప్రశాంతంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేలా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ల‌క్ష్మీశ ఈ సంద‌ర్భంగా ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *