​తిరుపతి రూరల్ చైతన్యపురంలో ఓటర్ల జాబితా సవరణ శిబిరాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ ఆదేశించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా ఆదివారం తిరుపతి రూరల్ పరిధి చైతన్యపురంలోని మండల పరిషత్ పాఠశాలలో నిర్వహించిన ఓటర్ల జాబితా సవరణలు, అభ్యంతరాల స్వీకరణ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ​ఈ సందర్భంగా శిబిరంలో అందుతున్న దరఖాస్తులు, క్లెయిమ్‌లు, అభ్యంతరాల నమోదు ప్రక్రియను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. అనంతరం అధికారులకు సూచనలు చేస్తూ పేరు మార్పులు, చిరునామా సవరణలు, మరణించిన వారి పేర్ల తొలగింపు ప్రక్రియను క్షేత్రస్థాయి పరిశీలన తర్వాతే నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అర్హులైన పౌరులందరూ తమ వివరాలను సరిచూసుకోవడానికి మరియు కొత్త నమోదుల కోసం ఈ ప్రత్యేక శిబిరాలను ఉపయోగించుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ​ఈ తనిఖీ కార్యక్రమంలో సంబంధిత రెవిన్యూ అధికారులు, బూత్ స్థాయి అధికారులు (BLOలు) మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *