విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలో అక్టోబర్ 8 నుంచి 22, 2026 వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ సరస్ మేళా ఏర్పాట్లలో భాగంగా, కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్, విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ మంగళవారం ప్రతిపాదిత ప్రాంగణమైన పునమిఘాట్, భవానిపురం సందర్శించి స్థల పరిశీలన నిర్వహించారు.
ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్.ఎం. ధ్యానచంద్ర, పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు అధికారులు పాల్గొన్నారు. జాతీయ సరస్ మేళాను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, స్థల విస్తీర్ణం, ప్రజల రాకపోకలు తదితర అంశాలను పరిశీలించారు.
మేళాలో వివిధ రాష్ట్రాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు, కళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించేందుకు స్టాళ్ల ఏర్పాటుకు తగిన ప్రణాళికలు రూపొందించాలని అధికారులు చర్చించారు.
విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్, చీఫ్ ఇంజనీర్ పి సత్యకుమారి, డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, వీఎంసీ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఇంచార్జ్ గోపాల నాయక్, డిప్యూటీ సిటీ ప్లానర్ చంద్రబోస్, ఆర్ యఫ్ ఒ రత్నబాబు, వెస్ట్ హసీల్దార్ ఇస్మాయిల్ , పోలీస్ సిబ్బంది, తదితర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News