హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
వినాయక చవితి సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహ్మత్ నగర్ డివిజన్, మరియు వీడియోగల్లీలో ఏర్పాటు చేసిన వివిధ గణేష్ మండపాలను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా గణనాథులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని.. నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, యువత మరియు భక్తులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News