“దేశమంటే మట్టి కాదోయ్… దేశమంటే మనుషులోయ్” అనే మహత్తర సందేశం…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
మహాకవి గురజాడ అప్పారావు జయంతిని పురస్కరించుకుని గుంటూరు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ ఆదేశాల మేరకు అదనపు కమిషనర్ ఐ.కిషోర్, విభాగాధిపతులు గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, సమాజంలోని మూఢనమ్మకాలు, అసమానతలు, సామాజిక రుగ్మతలను తన రచనల ద్వారా ప్రశ్నించిన గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారని పేర్కొన్నారు. ప్రజల్లో సామాజిక చైతన్యం, సమానత్వ భావనను పెంపొందించడంలో ఆయన రచనలు ఎంతో స్ఫూర్తిదాయకమని తెలిపారు. “దేశమంటే మట్టి కాదోయ్… దేశమంటే మనుషులోయ్” అనే మహత్తర సందేశం ద్వారా దేశభక్తి, మానవతా విలువలను ప్రజలకు చాటిన గురజాడ అప్పారావు ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సి.హెచ్ శ్రీనివాస్, సియంఓహెచ్ డాక్టర్ శాంతి కళ, యంహెచ్ఓ డాక్టర్ సురేష్, డి.సి.పి సూరజ్ కుమార్, ఏఓ తిరుపతి నాయుడు, మేనేజర్ బాలాజీ బాష, నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *