విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన సదస్సు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నవజీవన్ బాల భవన్ ఆధ్వర్యంలో సోమవారం విజయవాడ కొత్తపేట లోని శ్రీ అన్నపూర్ణ దేవి నగరపాలక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన సదస్సుని స్క్రీన్ ప్రొజెక్టర్ ద్వారా ఏర్పాటు చేశారు

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా NTR ఈగల్ విభాగం సబ్ ఇన్స్పెక్టర్ రాంబాబు మాట్లాడుతూ మత్తు పదార్థాలు తీసుకోవడం కేవలం మీ భవిష్యత్తు ను మాత్రమే కాదు, మీ కుటుంబ సభ్యుల భవిష్యత్తును కుడా ప్రమాదం లోకి నెట్టుతుంది. మత్తుపదార్థాలైన ఆల్కహాల్‌, పొగాకు, గంజాయి లాంటివాటి వినియోగం వల్ల శారీరక, మానసిక రుగ్మతలు తలెత్తుతాయన్నారు. ముఖ్యంగా యువత వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడితే భవిష్యత్తు నాశనమవుతుందన్నారు, మొదట్లో సరదాగా తీసుకునే మత్తపదార్థాలు క్రమేపీ నియంత్రణ కోల్పోయి మత్తుకు బానిసలు అవుతారనిన్నారు, విద్యార్థి దశలో విద్యార్థులు ఒక్కసారి ధూమపానం, మద్యం సేవించడం, గంజాయి, గుట్కా వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడితే ఏకాగ్రతను కోల్పోయి మానసికంగా కృంగిపోవడం జరుగుతుందనిన్నారు. అది నేర ప్రవృత్తివైపు కూడా ప్రేరేపిస్తుందని అని అన్నారు ,NDPS చట్టప్రకారం గంజాయి మరియు ఇతర నిషేదిత మాదకద్రవ్యాలు కలిగి ఉన్న, సేవించినా, సరఫరా చేసినా, పండించినా అది నేరమే అని, విషయాలు తెలిసినా లేదా అనుమానితులు గా గుర్తించినా ఆ సమాచారాన్ని 1972 టోల్ ఫ్రీ నెంబర్ కి తెలియజేయాలి అని అన్నారు

అనంతరం నవజీవన్ బాలభవన్ ప్రోగ్రాం మేనేజర్ గోళ్ళమూడి శేఖర్ బాబు మాట్లాడుతూ చెడు అలవాట్లు అనేవి ఒకరు నుంచి ఒకరు అలవాటు పడి తీవ్ర ప్రమాదస్థాయికి చేరుకుంటరని, క్యేన్సర్, మరియు ఇతర ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని స్నేహితులు కానీ మరి ఏ ఇతర వ్యక్తులు కానీ మాదక ద్రవ్యాలపై ప్రలోభపెడితే కచ్చితంగా వద్దు అని చెప్పాలని, మత్తు పధార్ధాలతో బ్రతుకు దుర్భరం చేసుకోవద్దు అని, మత్తుపదార్థాల వలన ఆరోగ్యం క్షీణించడంతో పాటు సామాజికంగా, ఆర్థికంగా నష్టపోయి కుటుంబ సత్సంబంధాలను కోల్పోతామని తెలిపారు. సరి అయిన అవగాహన లేక మాదకద్రవ్యాలకు బానిసలవుతున్న వారు ఎక్కువ మంది వున్నారని, ముందుగానే సరి అయిన అవగాహన పెంచుకొని జీవితాలను చక్క దిద్దికోవాలని, ఈ అవగాహనా కార్యక్రమాన్ని స్క్రీన్ ప్రొజెక్టర్ ద్వారా వివరించారు,

అనంతరం నీతోడు మానసిక వికాస కేంద్రం జోనల్ కోఆర్డినేటర్ SK నజ్మా మాట్లాడుతూ ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన బాలలను మరియు యువత ను డీ-ఎడిక్షన్ చికిత్స ద్వారా సాధారణ స్థితికి తీసుకొనిరావచ్చు అని ఈ చికిత్స అందించేందుకు ‘నవజీవన్ బాల భవన్ సంస్థ వారు నూజివీడు లో బోస్కో డీ-ఎడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసింది అని ఈ లాంటి సమస్యల తో ఉన్నవిద్యార్థులకు మరియు యువతకు నూజివీడు మండలం పొలసానపల్లి లో ఏర్పాటు చేసిన ” బోస్కో డీ అడిక్షన్ కేంద్రాన్ని” ఉచితంగా సంప్రదించవచ్చు అని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9490492020 అని అన్నారు

అనంతరం శ్రీ అన్నపూర్ణ దేవి నగర పాలక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మూరల వీర వెంకటేశ్వరావు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల వలన విద్యార్థులకు ఎంతో ఉపయోగ పడుతుందని, ప్రతి విద్యార్థి మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని అన్నారు ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నవజీవన్ బాల భవన్ వారికీ కృతజ్ఞతలు తెలియజేసారు

ఈ కార్యక్రమములో నీతోడు మానసిక వికాస కేంద్రం జోనల్ కోఆర్డినేటర్ పి విజయ్ కుమార్, బ్రదర్ ప్రశాంత్, బ్రదర్ ప్రణయ్, మరియు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థి, విద్యార్థునులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *