ఈ నెల 25న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్య‌క్ర‌మం

– 5.05 లక్షల మంది పిల్లలకు నులిపురుగుల నిర్మూలన మాత్రలు
– స‌మ‌న్వ‌య శాఖ‌ల స‌మావేశంలో జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్‌టీఆర్ జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని సెప్టెంబర్ 25న, ఆ రోజు వివిధ కారణాల వల్ల మాత్రలు తీసుకోలేకపోయిన పిల్లలకు అక్టోబర్ 5న మాప్-అప్ డే నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు.
సోమ‌వారం క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌.. జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డా. ఎ.శ్రవణ్ బాబు, వివిధ శాఖ‌ల అధికారుల‌తో క‌లిసి ఆరోగ్య‌వంత‌మైన పిల్ల‌ల కోసం నులిపురుగుల‌ను నులిమేద్దాం.. ప్ర‌చార పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించారు. స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారుల‌తో స‌మావేశ‌మై కార్య‌క్ర‌మం విజ‌య‌వంతానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై దిశానిర్దేశం చేశారు. జిల్లాలో ప్రభుత్వ , ప్రైవేటు విద్యాసంస్థలు కలిపి మొత్తం 3,125 విద్యాసంస్థల్లో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నామ‌ని.. మొత్తం 5,05,473 మంది పిల్లలను ఈ కార్యక్రమం పరిధిలోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న‌ట్లు అధికారులు వివ‌రించారు. ఒక‌టి నుంచి 19 ఏళ్ల‌లోపు పిల్ల‌లు, కిశోర బాల‌ల‌కు అల్బెండ‌జోల్ మాత్ర‌లు ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ అంగ‌న్వాడీ కార్యకర్తలు తల్లిదండ్రులకు నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడంతో పాటు, అర్హులైన పిల్లలను కార్యక్రమంలో భాగస్వామ్యం చేసేలా సమీకరణకు సహకరించాలన్నారు. కార్య‌క్ర‌మంలో డీఆర్‌వో ఎం.ల‌క్ష్మీన‌ర‌సింహం, ఆర్‌బీఎస్‌కే ప్రోగామ్ ఆఫీస‌ర్ డా. జి.మాధ‌వి, డీఈవో ఎల్‌.చంద్ర‌క‌ళ, ఐసీడీఎస్ పీడీ షేక్ రుక్సానా బేగం త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *