మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సీ పత్రాలు అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి పశ్చిమ ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్. ఓ. సి ) లను జారీ చేస్తున్నారు. ఎమ్మెల్యే సుజనా ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి భవానిపురం, ఎన్డీయే కార్యాలయంలో బాధితులకు ఎల్ ఓ సీ పత్రాలను అందజేశారు.

35 వ డివిజన్, డేవిడ్ స్ట్రీట్ కు చెందిన బంకా సతీష్ (32) ప్యాంక్రియాటైటిస్ బాధపడుతూ వైద్య సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 6.22 లక్షల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు. ఊర్మిళ నగర్ కు చెందిన జీ కృష్ణారెడ్డి (49) నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 2.96 లక్షల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు. లంబాడీ పేటకు చెందిన ఉప్పు అరుణ కుమారి (50) గర్భాశయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ వైద్య సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 1.54 లక్షల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు

47 వ డివిజన్ , కే ఎల్ రావు నగర్ కు చెందిన గరికే లక్ష్మి (50) బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతూ వైద్య సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 7.68 లక్షల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు. త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీ ను అందజేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు బాధితుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు..

మాజీ కార్పొరేటర్ మహ్మద్ అబ్దుల్ ఖాదర్, దుర్గమ్మ గుడి ట్రస్ట్ బోర్డు మెంబర్ అవ్వారు శ్రీనివాసరావు,కూటమి నేతలు దుర్బేసుల హుస్సేన్, బొల్లేపల్లి కోటేశ్వరరావు, అహ్మద్ అలీ, షేక్ కరీముల్లా, బుదాల నంద కుమారి తదితరులతో కలిసి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ఎల్ ఓ సీ పత్రాలు అందజేశారు..

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *