విజయవాడలో డిసెంబరులో బీసీ చైతన్య మహాసభ

-జాతీయ బీసీ చైతన్య సమితి వ్యవ స్థాపక అధ్యక్షుడు బీసీ రమణ ప్రకటన
-ఏపీ మహిళా వర్కిం గ్ ప్రెసిడెంట్‌గా తమ్మి శెట్టి సుభద్రమ్మ నియామకం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డిసెంబరు నెలలో విజయవాడలో జాతీ య బీసీ చైతన్య సమితి ఆధ్వర్యంలో బీసీల ఆత్మగౌరవం ప్రధాన డిమాండ్ల సాధన కోసం భారీ బీసీ చైతన్య మహా సభను నిర్వహించనున్నట్లు సమితి వ్యవస్థాప క అధ్యక్షుడు బీసీ రమణ వెల్లడించారు. ఈ సందర్భంగా సోమవారం విజయవాడ గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వాలు విఫలం ఎన్నికలకు ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు ఇచ్చిన హామీ లలో 90 శాతం నెరవేర్చలేదని బీసీ రమణ విమర్శించారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే ఓబీసీ కులగణన చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినప్పటికీ ఇంతవరకు అమలు చేయలేదని అలాగే రాష్ట్రంలో బీసీ రక్షణ చట్టం కానీ కులగణన కానీ పట్టాలెక్కలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలలో చైతన్యం తీసుకురావడానికి ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడానికే ఈ మహా సభను ఏర్పాటు చేస్తున్నామని దీనికి తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖ నాయకులు మహిళలు విద్యార్థులు పెద్దఎత్తున హాజరవుతారని తెలిపారు. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సముచిత స్థానం మహిళా బిల్లు అమలులోకి వచ్చి 34 శాతం రిజర్వేషన్ ద్వారా 34 మంది మహి ళా ఎమ్మెల్యేలు చట్టసభలకు వస్తే అందులో కనీసం 16 మంది బీసీ మహిళలు ఉండాలని డిమాండ్ చేశారు. బీసీ మహిళలను చైతన్య వంతం చేసేందుకు పోరాట పటిమ ఉన్న తమ్మిశెట్టి సుభద్రమ్మను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహి ళా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించి, నియామక పత్రా న్ని అందజేశారు. స్థానిక సంస్థల్లో ఏబీసీడీ వర్గీక రణ చేయాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ జనాభా దామాషా ప్రకారం విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని 34 శాతం రిజర్వేష న్‌ను జిల్లా యూనిట్‌గా పరిగణించాలన్నారు. స్థానిక సంస్థల రిజర్వేష న్లలో ఏబీసీడీ వర్గీకరణ చేపడితేనే బీసీ కులాలన్నింటికీ సమన్యాయం జరుగుతుందని లేకపోతే కేవలం నాలుగైదు వర్గాలకే ప్రయోజనం పరిమితమవుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం పాత్ర లోపించిందని, ప్రజావాదులుగా ప్రజల తరఫున పోరాడేందుకు తమ జాతీయ బిసి చైతన్య సమితి సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ బిసి చైతన్య సమితి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *