జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం…

బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఎలినినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని బాపట్ల జిల్లా ఇన్చార్జి మంత్రి, గృహ నిర్మాణ సంస్థ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. మంగళవారం, స్థానిక కలెక్టరేట్లోని వీక్షణ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి మంత్రి, గృహ నిర్మాణ సంస్థ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, 2025 -26 మొదటి త్రైమాసికంలో జీవిఏ లో 2127 కోట్లతో 11వ స్థానంలో ఉన్న బాపట్ల జిల్లా ప్రభుత్వం తీసుకున్న చర్యలకు 26 – 27 మొదటి త్రైమాసకంలో 291 8 కోట్లతో 8 వ స్థానంలో రావటం ఎంతో ఆనందంగా ఉందని, ఇందుకు గాను కలెక్టర్ మరియు వారి బృందాన్ని అభినందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎలినినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు యంత్రాంగం అంత సిద్ధంగా ఉందన్నారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు 44.7% తక్కువ వర్షపాతం నమోదు అయినట్లు ఆయన చెప్పారు. మొదటి నుండి ఎలినినో ప్రభావం పై రైతులను అప్రమత్తం చేశామని, రైతులు ఏ విధమైన పంటలు వేయాలి, ఏ విధంగా సాగు చేయాలని అధికారుల ద్వారా మరియు ప్రజాప్రతినిధుల ద్వారా తెలియజేసినట్లు ఆయన చెప్పారు. ఇప్పటివరకు జిల్లాలో 67% మేరా సాగు జరిగినట్లు ఆయన చెప్పారు. ఆ పంటలను కాపాడుకునేందుకు తీసుకోవాల్సి చర్యలపై అధికారులతో చర్చించినట్లు ఆయన చెప్పారు. పంటలను కాపాడుకోవడానికి అదనపు ఎరువులు కావాలని వేమూరు శాసనసభ్యులు కోరిన మీదట వ్యవసాయ శాఖ నిబంధనల మేరకు అదనపు ఎరువుల కొరకు జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి లేఖలు పంపి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన చెప్పారు. 39,862 మంది రైతులకు పిఎండిఎస్ కిట్లు అందజేసినట్లు ఆయన చెప్పారు. పి ఎమ్ డి ఎస్ ద్వారా పశుగ్రాస అభివృద్ధి లేక వాటిని దమ్ము చేయడం ద్వారా భూసారం పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ ద్వారా 97,890 మంది రైతులకు 113 కోట్ల రూపాయలు వారి ఖాతాలో జమచేసినట్లు ఆయన చెప్పారు. రైతు వేసిన ప్రతి పంటను ఈ క్రాప్ లో నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. 2014 -19 లో పట్టిసీమ నిర్మాణం ద్వారా కృష్ణా డెల్టాను కొంతమేర కాపాడుకోగలిగామన్నారు. పోలవరం నీటి ప్రవాహం తగ్గుతున్నందున అధికారులు రైతులు వద్దకు వెళ్లి అప్రమత్తంగా ఉండాలని తెలియజేయాలని సూచన చేసినట్లు ఆయన చెప్పారు. జిల్లాలో 75% ఎస్ ఎస్ ట్యాంకుల్లో 90 రోజులు సరిపడా త్రాగునీరు నింపినట్లు ఆయన చెప్పారు. 20 ట్యాంకులలో కేవలం 30 రోజులు మాత్రమే నీరు సరిపడా ఉన్నాయని, వాటిని కెడబ్ల్యూడి కాలువ ద్వారా నింపుకోవాలని ఆయన చెప్పారు. కె డబ్ల్యూ డి కాలువ ద్వారా వచ్చే నీటిని రైతులు పొలాలకు వాడుకోకుండా అధికారులు తగు జాగ్రత్త తీసుకోవాలని ఆయన చెప్పారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్త బోర్లను వేసి ట్యాంకులను నింపాలన్నారు. అన్ని ట్యాంకులో 90 రోజులు నీళ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపినట్లు ఆయన చెప్పారు. ఎలినినో ప్రభావంతో మత్స్య సంపదకు కొంతమేర నష్టం వాటిల్లె పరిస్థితి ఉందని, రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

భవిష్యత్తు అంతా ఉద్యానవన పంటలపై ఆధారపడి ఉందని జిల్లా ఇన్చార్జి, గృహ నిర్మాణ సంస్థ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఆరోగ్య సమస్యల దృష్ట్యా రైతులకు ఉద్యానవన పంటలపై అవగాహన కల్పించాలని అధికారులకు తెలిపినట్లు ఆయన చెప్పారు. ఆయిల్ ఫామ్ మరియు వక్కలు వంటి పంటలను ప్రోత్సహించాలని, వాటిపై ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలో రైతులు పామాయిల్ పంటలపై అధిక లాభాలు సంపాదిస్తున్నారని, రైతులను ఆ ప్రాంతాలకు తీసుకువెళ్లి ఆ పంటలపై అవగాహన కల్పించాలని అధికారులకు తెలిపినట్లు ఆయన చెప్పారు. జిల్లాలో 10 వేల పామ్ ఆయిల్ మొక్కలను రైతులు అందజేసి వారిచే పంట వేయించినట్లు ఆయన చెప్పారు. జిల్లాలో 550 ఎకరాలలో పంటల వేయుటకు నిర్దేశించినట్లు, రాబోవు రోజుల్లో మరిన్ని ఎకరాల్లో ఈ పంటలను విస్తరింప చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపినట్లు ఆయన చెప్పారు.

వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు ప్రభుత్వం మత్స్యకార భరోసా ను అందించినట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి, గృహ నిర్మాణ సంస్థ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. 14,447 మంది మత్స్యకారులకు 28.8 కోట్లు అందించినట్లు ఆయన తెలిపారు. నిజాంపట్నంలో 450 కోట్లతో ఫిషింగ్ హార్బర్ ను ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి పూర్తి చేసి మత్స్యకారులకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని ఆయన చెప్పారు. నిజాంపట్నం దిండి గ్రామంలో ఆక్వా పార్క్ పనులు 50 శాతం పూర్తయినాయని, మిగిలిన పనులను త్వరలో పూర్తి చేయుటకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

త్రాగునీటితో పాటు పశుగ్రాసం కు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాలని మంత్రి చెప్పారు. 75% సబ్సిడీతో పశుగ్రాస విత్తనాలను రైతులకు అందజేస్తున్నట్లు ఆయన చెప్పారు. పాడి రైతులకు ఇచ్చే దాన, ఎలినినో పరిస్థితుల్లో ఈ సంవత్సరం 200 టన్నులు అదనంగా కావాలని శాసనసభ్యులు కోరిన మీదట ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. పాడి పశువులను ఎలినినో ప్రభావం నుండి కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఎలినినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటూ, ఎక్కడా కూడా విద్యుత్ కోతలు లేకుండా అత్యధిక ధరలతో విద్యుత్తును కొనుగోలు చేసి పరిశ్రమలకు, ఇళ్లకు అందజేస్తున్నట్లు ఆయన చెప్పారు. రహదారుల మరమ్మతులకు ఒక ప్రణాళిక బద్ధంగా 100% పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. బాపట్ల, చీరాల బీచ్ లను గోవా తరహాలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఆయన వెంట జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి, వేమూరు,చీరాల శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు, ఎం ఎం కొండయ్య, జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు మరియు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *