Breaking News

స్థానిక సంస్థల రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం : మస్తాన్ వలీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రిజర్వేషన్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ ఆరోపించారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఎస్సీ, బీసీ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని కోరినట్లు తెలిపారు. ఆన్‌లైన్ నామినేషన్ల విధానం ప్రవేశపెట్టాలని, ఛాలెంజ్ ఓటుకు అవకాశం కల్పించాలని, పోలింగ్ కేంద్రాల సీసీటీవీ ఫుటేజీని కనీసం 90 రోజులపాటు భద్రపరచాలని సూచించారు. అభ్యర్థులకు కుల ధృవీకరణ పత్రాలను 24 గంటల్లో జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియలో ప్రజలకు అన్యాయం జరగకుండా ఎన్నికల కమిషన్ తగిన చర్యలు తీసుకోవాలని మస్తాన్ వలీ కోరారు. ఈ సమావేశంలో ఏపీసీసీ ఉపాధ్యక్షులు అడ్మినిస్ట్రేషన్ ఇంచార్జి కొలనుకొండ శివాజి, మీసాల రాజేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఏపీ-తమిళనాడు ముఖ్యమంత్రులు చంద్రబాబు-విజయ్ భేటీ

-గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై చర్చ -చెన్నై తాగునీటి అవసరాలు తీర్చాలని కోరిన తమిళనాడు సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: …