Breaking News

సరస్ మేళాకు వచ్చే వారికి స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందిస్తున్నాం

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం భవానీపురంలోని పున్నమి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన సరస్ మేళాను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

అక్టోబర్ 15 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న సరస్ మేళాలో వివిధ రాష్ట్రాల నుంచి లఖ్‌పతి దీదీలు పాల్గొననున్న నేపథ్యంలో, వారికి, మేళా విచ్చేసే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మేళాకు విచ్చేసే లఖ్‌పతి దీదీలు, సందర్శకులకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీటిని అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా కమిషనర్ స్వయంగా తాగునీటి నాణ్యతను పరిశీలించారు. తాగునీటిని ఎప్పటికప్పుడు పరీక్షించి, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న నీటినే సరఫరా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మేళా జరిగే అన్ని రోజులలో తాగునీటి సరఫరాపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఏపీ-తమిళనాడు ముఖ్యమంత్రులు చంద్రబాబు-విజయ్ భేటీ

-గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై చర్చ -చెన్నై తాగునీటి అవసరాలు తీర్చాలని కోరిన తమిళనాడు సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: …