గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలోని ఆకులవారితోటలో నిర్మాణంలో ఉన్న త్రాగునీటి రిజర్వాయర్ డిశంబర్ నాటికి పూర్తి చేసి, త్రాగునీటి సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆకులవారితోట, బొంతపాడు, ఏటుకూరు తదితర ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించి, జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఆకులవారితోటలో రిజర్వాయర్ 40 శాతం పనులు పూర్తి అయిందని, పెండింగ్ పనులు డిశంబర్ నాటికి పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకోవాలన్నారు. అలాగే ఉద్యోగనగర్ రిజర్వాయర్ పనులు కూడా వేగంగా చేసేలా చూడాలని, పనుల్లో నిర్దేశిత నాణ్యత ప్రమాణాలు ఉండేలా ఇంజినీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. పనులు జరిగే సమయంలో కార్మికుల తగిన రక్షణ సదుపాయాలు కల్పించాలని కాంట్రాక్టర్ కి స్పష్టం చేశారు. బొంతపాడులోని క్రిస్టియన్ శ్మశానవాటికను పరిశీలించి, లైట్లు, మెయిన్ గేటుకి నేమ్ బోర్డ్ ఏర్పాటు చేయాలని ఏఈని ఆదేశించారు. ఏటుకూరులోని చెరువును పరిశీలించి, చెరువులను సమగ్రంగా సర్వే చేసి, హద్దులు ఫిక్స్ చేయాలని పట్టణ ప్రణాళిక అధికారులను, హద్దులు అనంతరం చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఎస్ఈని ఆదేశించారు. వాకింగ్ ట్రాక్ లో చేపట్టిన లైటింగ్, ట్రాక్ లో గ్రావెల్ ఏర్పాటు చేయాలని ఏఈని ఆదేశించారు.
పర్యటనలో ఎస్ఈ జి.వెంకటేశ్వరరావు, ఈఈ సుందర్రామిరెడ్డి, ఏసిపీ జకిరా, ఎస్ఎస్ వెంకటప్పయ్య, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News