Breaking News

అవకాశాలను అందిపుచ్చుకోండీ…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
అమరావతి ప్రాంతంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలని పెట్టుబడిదారులను రాష్ట్ర యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ కోరారు. అమరావతి ఎస్.ఆర్.ఎం విశ్వవిద్యాలయంలో శుక్రవారం సి.ఐ.ఐ ప్రాంతీయ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో తొమ్మిది జిల్లాలు ఉన్నాయని, రాష్ట్ర జి.డి.పికి 35 శాతం సమకూర్చుతుందన్నారు. 2030, 2035, 2047 సంవత్సరాలకు సాధించాల్సిన ఆర్థిక అభివృద్ధి ప్రణాళికలను రూపొందించడం జరిగిందని చెప్పారు. సుస్థిర, సమ్మిళిత అభివృద్ధి సాధించుటకు ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు . ఈ ప్రాంతంలో వివిధ రకాల 46 ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని, 26 ఎం.ఎస్.ఎం.ఇ లకు 480 ఎకరాలు కేటాయించడం జరిగిందని వివరించారు. మచిలీపట్నం పోర్టు అనుసంధానంగా ఉంటుందని అన్నారు. ప్రకాశం జిల్లాలో బి.పి.సి.ఎల్ రిఫైనరీ, దోనేపూడిలో భారత డైనమిక్స్ సంస్థ యూనిట్ రానుందని చెప్పారు. పర్యాటక రంగంలో కూడా పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో అమరావతి ప్రాంతం ప్రధాన ఆర్ధిక అభివృద్ధి ప్రాంతంగా ఎదుగుతుందని చెప్పారు. రాష్ట్ర శిఖలో అమరావతి కిరీటంగా నిలవనుందన్నారు. ఆర్థిక, పెట్టుబడి, సుస్థిర అభివృద్ధి, జీవన ప్రమాణాల మెరుగు వంటి అంశాల కలయికగా అమరావతి ప్రాంతం అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని వివరించారు. హై స్పీడ్ ట్రైన్స్ తో పాటు సమీకృత మౌళిక సదుపాయాలు వస్తున్నాయని చెప్పారు. అభివృద్ధికి అవకాశాలు గల రంగాలను గుర్తించడం జరుగుతుందని అన్నారు.

పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ మాట్లాడుతూ పోర్టులు, షిప్ బిల్డింగ్ క్లస్టర్ లు, ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ లు రానున్నాయన్నారు. ప్రభుత్వం విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ప్రాంతాలను ఆర్థిక అభివృద్ధి

సి.ఐ.ఐ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు నరేంద్ర కుమార్ శరణం, ఐ.టి.సి అగ్రి బిజినెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాహుల్ గౌరహ, పి.ఐ డేటా సెంటర్స్ సి.ఇ.ఓ కళ్యాణ్ ముప్పనేని మాట్లాడుతూ రాష్ట్రంలో సహజ వనరులు, పారిశ్రామికవేత్తల ప్రతిభ, మౌలిక సదుపాయాలు, స్పష్టమైన విధానపరమైన దార్శనికత ఉన్నాయన్నారు. వీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను భారతదేశానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు, ఎగుమతులకు ప్రముఖ గమ్యస్థానంగా తీర్చిదిద్దవచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో తన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఐటీసీ (ITC) సంస్థ కట్టుబడి ఉందన్నారు. రైతుల కోసం 360 డిగ్రీల సమగ్ర పరిష్కారాన్ని అందిస్తున్నానన్నారు. ఇందులో డిజిటల్ వ్యవస్థతో పాటు, లావాదేవీలను సమన్వయం చేసేందుకు భౌతిక వ్యవస్థ కూడా ఉందన్నారు. రైతులకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన, వారి అవసరాలకు అనుగుణమైన, శాస్త్రీయ ఆధారాలతో కూడిన వ్యవసాయ సలహాలు అందుతాయన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను కూడా ఇదే వేదిక ద్వారా విక్రయించుకోవచ్చన్నారు. ఈ కార్యకలాపాలను భౌతికంగా సమన్వయం చేసేందుకు రైతు ఉత్పత్తిదారుల సంస్థలతో (FPOs) కూడిన విస్తృత వ్యవస్థను మేము అభివృద్ధి చేశామన్నారు. ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, సామాజిక అభివృద్ధి
ఈ కార్యక్రమాల ద్వారా సంబంధిత రంగాల్లోని ప్రజలకు గణనీయమైన ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ప్రజలకు స్థిరమైన ఆదాయ మార్గాలను కల్పించడం,  వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించడం, స్థానిక సమాజాలు, ప్రజా సంస్థలు, సంబంధిత వ్యవస్థలను మరింత పటిష్ఠం చేయడం ఆశయంగా పనిచేస్తున్నట్లు చెప్పారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం పెట్టుబడిదారుల మధ్య ఒప్పంద పత్రాలను కుదుర్చుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఫుడ్ ప్రాసెసింగ్ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటమనేని, రవాణా శాఖ కార్యదర్శి కోన శశిధర్, సి.ఆర్.డి.ఏ కమిషనర్ విజయ రామరాజు, ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు (ఇ.డి.బి) సి.ఇ.ఓ షన్ మోహన్, జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఇతర ఉన్నత అధికారులు, పారిశ్రామిక ప్రతినిధులు, పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

హజ్–2027 యాత్రికుల ఎంబార్కేషన్ పాయింట్ల మార్పు కోసం వినతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: హజ్–2027 యాత్రకు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 11 మంది యాత్రికులు తమ ప్రయాణ …