Breaking News

భక్తులకు సౌకర్యాల కల్పనే ప్రభుత్వ ప్రాధాన్యం: మంత్రి కొలుసు పార్థసారథి

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త:
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు వచ్చే ప్రతి భక్తుడికి సంతృప్తికరమైన దర్శనం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సమాచార, గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. శుక్రవారం శ్రీ కనకదుర్గమ్మవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని, రైతులు సుఖసంతోషాలతో ఉండాలని, యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభించాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతం కావాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, విలేకరులు, వారి కుటుంబాలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

హజ్–2027 యాత్రికుల ఎంబార్కేషన్ పాయింట్ల మార్పు కోసం వినతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: హజ్–2027 యాత్రకు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 11 మంది యాత్రికులు తమ ప్రయాణ …