Breaking News

దసరా ఉత్సవాల భక్తులకు ప్రథమ చికిత్స శిబిరం… : డాక్టర్ మాకాల సత్యనారాయణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
దసరా ఉత్సవాలలో పాల్గొనే భక్తులకు ప్రథమ చికిత్స శిబిరాలను నిర్వహిస్తున్న డాక్టర్ బి సి రాయ్ ప్రధమ చికిత్స ప్రదాతల సంఘం, ఎన్టీఆర్ జిల్లా విభాగం ఈరోజు విజయవాడ పడమట శ్రీ దత్త సచ్చిదానంద ఆశ్రమంలో శిబిరం ఏర్పాటు చేసి, భక్తులకు సేవలు అందించారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మాకాల సత్యనారాయణ నాయకత్వంలోని బృందం సేవలు అందించి తదుపరి చికిత్సలకు, సూచనలు చేయటం మరియు వారికి మోడీ హెల్త్ కేర్ స్టిక్స్ అందించారు. ఈ బృందంలో పాల్గొన్న వాలంటీర్స్ ని జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మాకాల సత్యనారాయణ, డాక్టర్ బి సి రాయ్ ప్రధమ చికిత్స ప్రభాతల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ షేక్ ఇమామ్ సాహెబ్ మరియు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సి ఏల్ వెంకట్రావు అభినందించారు. ఫస్ట్ ఎయిడ్ బృందాన్ని శ్రీ దత్త ఆశ్రమం ఆర్గనైజర్స్ కృతజ్ఞతలు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవకాశాలను అందిపుచ్చుకోండీ…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: అమరావతి ప్రాంతంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలని పెట్టుబడిదారులను రాష్ట్ర యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖ …