ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారు మూలా నక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. విద్యల తల్లి, జ్ఞానప్రదాయిని అయిన అమ్మవారిని సరస్వతీ దేవి స్వరూపంలో దర్శించుకునేందుకు భక్తులు విశేష భక్తిశ్రద్ధలతో అమ్మవారిని స్మరించుకుంటున్నారు. మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారిని సరస్వతీ దేవి అలంకారంలో దర్శించుకోవడం భక్తులకు ఆధ్యాత్మికంగా విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. జ్ఞానానికి, విద్యకు, వివేకానికి ప్రతీకగా భావించే శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తూ అనుగ్రహిస్తున్నారు. …
Read More »Daily Archives: October 15, 2026
మహిళా సాధికారతే వికసిత్ భారత్కు పునాది
-గ్రామీణ మహిళల ఉత్పత్తులకు ‘స్వయం ఏపీ’ బ్రాండ్ -విజయవాడలో జాతీయ సరస్ మేళా-2026 ప్రారంభం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: గ్రామీణ మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేందుకు ‘స్వయం ఏపీ’ బ్రాండ్ను ప్రవేశపెట్టినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మహిళలను సంపద సృష్టికర్తలుగా తీర్చిదిద్దడం, గ్రామాలను ఉపాధి కేంద్రాలుగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. విజయవాడలో నిర్వహిస్తున్న జాతీయ సరస్ మేళా-2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ప్రారంభించారు. రాష్ట్రంలో 11 లక్షల …
Read More »దసరా ఉత్సవాల్లో వైద్య సేవలకు విస్తృత ఏర్పాట్లు
-దుర్గమ్మ ఉత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: దసరా ఉత్సవాలకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో వైద్యారోగ్యశాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది 16 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి, 49 మంది వైద్యాధికారులు, 30 మంది ప్రత్యేక వైద్యులు, 431 మంది పారామెడికల్ సిబ్బందిని నియమించింది. అత్యవసర సేవల కోసం 9 అంబులెన్సులను అందుబాటులో ఉంచింది. వైద్య సేవల పర్యవేక్షణ కోసం 19 సెక్టార్లను ఏర్పాటు చేసి, …
Read More »స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు 28 మంది ఐఏఎస్ అధికారులను సాధారణ పరిశీలకులుగా నియమించిన రాష్ట్ర ఎన్నికల సంఘం
-ఎన్నికలను స్వేచ్ఛగా, నిస్పక్షపాతంగా నిర్వహించాలి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా సాధారణ పరిశీలకులకు సూచించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు జిల్లాకు ఒక అధికారి చొప్పున 28 మంది మంది ఐఏఎస్ అధికారులను సాధారణ పరిశీలకులుగా నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గురువారం …
Read More »ఏపీలో నాలుగు రోజుల పాటు వర్షాలు
-పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ప్రఖర్ జైన్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న నాలుగు రోజుల పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. శుక్రవారం మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు పడే సమయంలో చెట్ల కింద, భారీ …
Read More »45వ ఏపీ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో లక్ష్మయ్యకు మూడు పతకాలు.. లక్నో జాతీయ పోటీలకు ఎంపిక
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: 45వ ఏపీ మాస్టర్స్ రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఎన్టీఆర్ జిల్లా క్రీడాకారుడు లక్ష్మయ్య అద్భుత ప్రతిభ కనబరిచి మూడు పతకాలు సాధించడంతో పాటు జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు ఆయన అర్హత సాధించారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మైదానంలో అక్టోబర్ 10, 11 తేదీల్లో మాస్టర్స్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (MAFI) ఏపీ బ్రాంచ్ ఆధ్వర్యంలో 45వ ఏపీ మాస్టర్స్ రాష్ట్ర అథ్లెటిక్స్ …
Read More »విజయవాడ ఉత్సవ్లో భాగస్వాములు కావడం ఆనందంగా ఉందన్న ప్రముఖులు
-విజయవాడ ఉత్సవ్ 2.0లో పాల్గొన్న ప్రముఖ సినీ నటుడు బండ్ల గణేష్, ఎంపీ కేశినేని చిన్ని సతీమణి జానకి లక్ష్మి,కేశినేని వెంకట్, బోండా సిద్ధార్థ -సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలతో అలరించిన కళాకారులు -అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్న కళాకారులకు జ్ఞాపికలు అందజేత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఉత్సవ్ 2.0లో భాగంగా సింగనగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియం వేదికగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్, విజయవాడ ఎంపీ …
Read More »కనకదుర్గమ్మకు అన్నవరం దేవస్థానం పట్టు వస్త్రాల సమర్పణ
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : దసరా ఉత్సవాలను పురస్కరించుకుని అన్నవరం దేవస్థానం తరఫున శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి గురువారం మధ్యాహ్నం పట్టు వస్త్రాలను సమర్పించారు. అన్నవరం దేవస్థానం ఈవో చక్రధరరావు ఆధ్వర్యంలో ఆలయ బృందం ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించింది. అన్నవరం ఆలయ బృందానికి విజయవాడ దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వి.కె. శీనా నాయక్ స్వాగతం పలికారు. అనంతరం బృంద సభ్యులకు శ్రీ కనకదుర్గమ్మ దర్శనం కల్పించి, ఆశీర్వచనం అందజేశారు. తీర్థప్రసాదాలతో పాటు అమ్మవారి చిత్రపటాన్ని అందించారు. …
Read More »కనకదుర్గమ్మకు శ్రీశైలం దేవస్థానం పట్టు వస్త్రాల సమర్పణ
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : దసరా ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీశైలం దేవస్థానం తరఫున శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి గురువారం మధ్యాహ్నం పట్టు వస్త్రాలను సమర్పించారు. శ్రీశైలం దేవస్థానం చైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆలయ ప్రతినిధుల బృందం విజయవాడలోని ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించింది. శ్రీశైలం ఆలయ బృందానికి విజయవాడ దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వి.కె. శీనా నాయక్ స్వాగతం పలికారు. అనంతరం బృంద సభ్యులకు శ్రీ కనకదుర్గమ్మ దర్శనం కల్పించి, ఆశీర్వచనం అందజేశారు. …
Read More »శ్రీ కనకదుర్గ అమ్మవారికి రూ. 75 లక్షల విలువైన స్వర్ణ కిరీటం బహూకరణ
-494 గ్రాముల బంగారు కిరీటం సమర్పించిన శ్రీకాకుళం దాతలు ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అత్యంత వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల వేళ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారికి గురువారం ఉదయం విశేష స్వర్ణ కానుక సమకూరింది. శ్రీకాకుళం పట్టణానికి చెందిన భక్తులు శ్రీ కూర్మినాయుడు, శ్రీమతి పద్మావతమ్మ దంపతుల కుమారుడు శ్రీ కె. దుర్గా శ్రీనివాస్ అమ్మవారికి సుమారు రూ. 75 లక్షల విలువైన దివ్య స్వర్ణ కిరీటాన్ని …
Read More »
Prajavartha Online Telugu News