తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు. ఈ మేరకు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు, బెదిరింపులు ఎదురుకాకుండా తగిన భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్, తిరుపతి జిల్లా కలెక్టరు ఎస్పీలకు లేఖ రాశారు. అక్టోబర్ 14 న జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ను ప్రస్తావిస్తూ, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. …
Read More »Daily Archives: October 15, 2026
అభివృద్ధి పనుల పరిశీలన…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలోని ఆకులవారితోటలో నిర్మాణంలో ఉన్న త్రాగునీటి రిజర్వాయర్ డిశంబర్ నాటికి పూర్తి చేసి, త్రాగునీటి సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆకులవారితోట, బొంతపాడు, ఏటుకూరు తదితర ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించి, జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఆకులవారితోటలో రిజర్వాయర్ 40 శాతం పనులు …
Read More »ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యల పై సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ సజావుగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూసేందుకు నియమించిన ఫ్లయింగ్ స్క్వాడ్స్ మరియు స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్లు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (యంసిసి) ను పక్కాగా అమలు జరిగేలా చూడాలని నగర కమిషనర్ మరియు అడిషనల్ ఎలక్షన్ అధారిటీ కె. మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. గురువారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఫ్లయింగ్ స్క్వాడ్స్ మరియు స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి …
Read More »లోకల్ బాడీ ఎలక్షన్స్ సజావుగా జరిగేలా అన్నీ రాజకీయ పార్టీలు సహకరించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో జరగనున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ సజావుగా జరిగేలా అన్నీ రాజకీయ పార్టీలు సహకరించాలని నగర కమిషనర్ మరియు అడిషనల్ ఎలక్షన్ అధారిటీ కె. మయూర్ అశోక్ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. లోకల్ బాడీ ఎన్నికల సందర్భంగా గురువారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్సు హాల్ నందు నగరంలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, ఎన్నికల నిర్వహణ పై చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర …
Read More »మారిస్ స్టెల్లా కళాశాలలో జాతీయ సదస్సు ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మారిస్ స్టెల్లా కళాశాల (స్వయంప్రతిపత్తి) ఆర్థికశాస్త్ర విభాగం, హైదరాబాద్లోని భారతీయ సామాజిక శాస్త్ర పరిశోధనా మండలి దక్షిణ ప్రాంతీయ కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో “ప్రపంచీకరణ యుగంలో మహిళా సాధికారత, వ్యవస్థాపకత, సమ్మిళిత వృద్ధి: ఆవిష్కరణలు, సవాళ్లు, విధాన దృక్పథాలు” అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. అక్టోబరు 15, 16 తేదీల్లో నిర్వహిస్తున్న ఈ సదస్సును కళాశాల ప్రిన్సిపాల్ డా. సిస్టర్ ఇన్నియసమ్మ గాదె, కరస్పాండెంట్ డా. సిస్టర్ లీనా క్వాడ్రాస్ ప్రారంభించారు. …
Read More »1450 విద్యుత్ బస్సుల ప్రైవేటు టెండర్లు రద్దు చేయాలి
-అక్టోబర్ 22, 23 తేదీల్లో నల్లబ్యాడ్జీలతో నిరసన: ఆర్టీసీ జేఏసీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్టీసీలో రెండో దశలో ప్రవేశపెట్టనున్న 1,450 ఏసీ విద్యుత్ బస్సులను ప్రైవేటు ఆపరేటర్ల ద్వారా నిర్వహించేందుకు జారీ చేసిన టెండర్లను తక్షణమే రద్దు చేయాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ కన్వీనర్లు వై. శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అడ్మిన్) కె.ఎస్. బ్రహ్మానందరెడ్డికి వినతిపత్రం అందజేశారు. 29 ఆర్టీసీ డిపోల్లో గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జీసీసీ) …
Read More »కనకదుర్గమ్మకు విజయకీలాద్రి నుంచి సారె సమర్పణ
విజయవాడ (ఇంద్రకీలాద్రి), నేటి పత్రిక ప్రజావార్త : విజయదశమి శరన్నవరాత్రుల సందర్భంగా సీతానగరంలోని విజయకీలాద్రి దివ్యక్షేత్రం నుంచి ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మవారికి గురువారం భక్తిశ్రద్ధలతో సారె సమర్పించారు. పరమహంస పరివ్రాజకులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామివారి మంగళాశాసనాలతో ఈ కార్యక్రమం నిర్వహించారు. విజయకీలాద్రి ఆశ్రమ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు, రఘునాథాచార్యులు, ఆలయ అర్చకులు అనంత్ స్వామి, శ్రీనివాస్ సుదర్శన స్వామి, శ్రీనివాస్ సంతోష్ స్వామి, నల్లూరి కృష్ణతో పాటు వేద విద్యార్థులు పాల్గొని అమ్మవారికి సారె సమర్పించారు. ప్రతి ఏడాది శరన్నవరాత్రుల …
Read More »టాగోర్ గ్రంథాలయంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక మహాత్మా గాంధీ రోడ్డులోని టాగోర్ స్మారక గ్రంథాలయంలో గురువారం భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రంథాలయాధికారి కే రమాదేవి డాక్టర్ అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు ఆయన జీవిత విశేషాలను, బాల్యం నుంచి ఎన్నో కష్టాలను అధిగమించి గొప్ప శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా ఎదిగిన విధానాన్ని వివరించారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచే పెద్ద లక్ష్యాలను ఏర్పరచుకొని, …
Read More »శ్రీ విజయకీలాద్రిలో వైభవంగా జయలక్ష్మీ అమ్మవారి అభిషేకం
సీతానగరం, నేటి పత్రిక ప్రజావార్త : సీతానగరంలోని శ్రీ విజయకీలాద్రి దివ్యక్షేత్రంలో శరన్నవరాత్రి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. పరమహంస పరివ్రాజకులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళాశాసనాలతో గురువారం శ్రీ జయలక్ష్మీ అమ్మవారికి విశేష అభిషేకం, కుంకుమార్చన, శ్రీయాగం నిర్వహించారు. ఉదయం 9 గంటలకు అభిషేకం, కుంకుమార్చన, 10 గంటలకు శ్రీయాగం శాస్త్రోక్తంగా జరిగాయి. సాయంత్రం 5.30 గంటలకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పల్లకిసేవ, అర్చన, నివేదన, మంగళాశాసనం తదితర కార్యక్రమాలు …
Read More »ఎయిమ్స్ మంగళగిరిలో ప్రపంచ శరీర నిర్మాణ శాస్త్ర దినోత్సవం
మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : ఎయిమ్స్ మంగళగిరిలో ప్రపంచ శరీర నిర్మాణ శాస్త్ర దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య విద్య, పరిశోధనలకు విశేష సేవలందిస్తున్న స్వచ్ఛంద దేహదాతలకు నివాళులర్పించారు. దేహదాన స్మారక గోడను ప్రారంభించడంతో పాటు ఎనిమిది మంది దాతల కుటుంబాలను, 30 మంది కాబోయే దేహదాతలను సత్కరించారు. ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎమెరిటస్ డా. వి. సుభద్ర దేవి వైద్య విద్యలో శరీర నిర్మాణ శాస్త్రం ప్రాధాన్యంపై ఉపన్యాసం ఇచ్చారు. ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, …
Read More »
Prajavartha Online Telugu News