Breaking News

టాగోర్ గ్రంథాలయంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక మహాత్మా గాంధీ రోడ్డులోని టాగోర్ స్మారక గ్రంథాలయంలో గురువారం భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
గ్రంథాలయాధికారి కే రమాదేవి డాక్టర్ అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు ఆయన జీవిత విశేషాలను, బాల్యం నుంచి ఎన్నో కష్టాలను అధిగమించి గొప్ప శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా ఎదిగిన విధానాన్ని వివరించారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచే పెద్ద లక్ష్యాలను ఏర్పరచుకొని, క్రమశిక్షణతో చదువుతూ, పట్టుదలతో తమ లక్ష్యాలను సాధించాలని కలాం జీవితం మనకు తెలియజేస్తుందని పేర్కొన్నారు. యువతలో శాస్త్రీయ దృక్పథాన్ని, దేశభక్తిని, సేవాభావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.
ప్రతి విద్యార్థి కలలు కనండి ఆ కలలను సాకారం చేసుకోండి కష్టపడి చదవండి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించండి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది వై ధనలక్ష్మి, ఎం వెంకటేశ్వర్లు వివిధ స్కూల్స్ విద్యార్థులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

హజ్–2027 యాత్రికుల ఎంబార్కేషన్ పాయింట్ల మార్పు కోసం వినతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: హజ్–2027 యాత్రకు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 11 మంది యాత్రికులు తమ ప్రయాణ …