Breaking News

Daily Archives: October 15, 2026

పటిష్టంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు

– నిష్పాక్షికంగా, పారద‌ర్శ‌కంగా అమ‌లుకు చ‌ర్య‌లు – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల 2వ సాధారణ ఎన్నికల నేప‌థ్యంలో ఈ నెల 14వ తేదీ నుంచి ఎన్నిక‌ల ప్ర‌క్రియ ముగిసే వ‌ర‌కు ఎన్టీఆర్ జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడ‌ల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్)ని పటిష్టంగా అమ‌లు చేయనున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. ఈ మేర‌కు ప్రవర్తనా నియమావళిని నిష్పాక్షికంగా, పారదర్శకంగా అమలు చేయడానికి అధికారుల‌కు ఆదేశాలు జారీచేశారు. …

Read More »

భక్తుల సేవలోనే అధికార యంత్రాంగం

– మూలా న‌క్ష‌త్రాన అమ్మ దర్శనానికి ఆటంకం లేకుండా ప‌క‌డ్బందీ ఏర్పాట్లు – మూడు ల‌క్ష‌ల మంది వ‌ర‌కు భ‌క్తులు వ‌చ్చినా ఇబ్బంది లేదు – సాయంత్ర 4-4.30 గంట‌ల మ‌ధ్య‌లో ఇంద్ర‌కీలాద్రికి ముఖ్య‌మంత్రి – 450 సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ – భ‌క్తుల‌కు మంచినీరు, మజ్జిగ, బిస్కెట్లు, అన్న ప్ర‌సాదం పంపిణీ – వర్షం కురిసినా అమ్మవారి దర్శనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు – కొండరాళ్లపై నిరంతర నిఘా.. ప్ర‌త్యేక సాంకేతిక బృందం ప‌ర్య‌వేక్ష‌ణ‌ – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, సీపీ …

Read More »

భ‌క్తుల సేవ‌లో.. క‌లెక్ట‌ర్ నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌..

-క‌మాండ్ కంట్రోల్ కేంద్రంతో పాటు క్షేత్ర‌స్థాయిలో సుడిగాలి త‌నిఖీలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దసరా ఉత్సవాల్లో 5వరోజు -జగన్మాత శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తుండగా ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతుంది. అన్ని క్యూ లైన్ల‌లో భక్తులు త‌ర‌లివెళ్తూ అమ్మ ద‌ర్శ‌నం చేసుకుంటున్నారు. మ‌రోవైపు రాష్ట్రం న‌లుమూల‌ల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వ‌స్తున్న భ‌క్తుల‌కు ఎక్క‌డా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని శాఖ‌లు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేస్తున్నాయి. జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ఎప్ప‌టిక‌ప్పుడు క్షేత్ర‌స్థాయిలో క్యూలైన్ల‌ను ప‌రిశీలిస్తుండ‌టంతో …

Read More »

చిట్టినగర్, శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయంలో ప్రత్యేక పూజలు..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చిట్టినగర్ లోని శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 5వ రోజైన గురువారం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారిని పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో , సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు. ఆలయ అధ్యక్షుడు పోతిన భేసు కంటేశ్వరుడు, కమిటీ సభ్యులు ప్రత్తిపాటి శ్రీధర్ కు …

Read More »

జీవనశైలిలో మార్పులతో వెన్నెముక ఆరోగ్య పరిరక్షణ… : డా. జి.పి.వి. సుబ్బయ్య

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ఆధునిక జీవనశైలిలో శారీరక శ్రమ తగ్గడం, గంటల తరబడి కూర్చుని పనిచేయడం, మొబైల్ ఫోన్లను తలవంచి ఎక్కువసేపు చూడటం వంటి అలవాట్ల వల్ల చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అనేకమంది మెడనొప్పి, నడుమునొప్పి సమస్యలను ఎదుర్కొంటున్నారని ప్రముఖ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు డా. జి.పి.వి. సుబ్బయ్య తెలిపారు. నొప్పి వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే, ముందుగానే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా వెన్నెముక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. అక్టోబరు 16న ప్రపంచ వెన్నెముక దినోత్సవాన్ని పురస్కరించుకుని …

Read More »

దక్షిణ ప్రాంతీయ సీబీఆర్‌ఎన్‌ పోటీల్లో తమిళనాడు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ జట్టు విజయం

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణ, దక్షిణ మధ్య ప్రాంతీయ స్థాయి సీబీఆర్‌ఎన్‌ (రసాయన, జీవ, రేడియోలాజికల్‌, అణు ప్రమాదాలు) పోటీల్లో తమిళనాడు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) విజేతగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌ ఎస్‌డీఆర్‌ఎఫ్‌ జట్టు రన్నరప్‌గా నిలిచింది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులోని పదో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) బెటాలియన్‌ ఆధ్వర్యంలో అక్టోబరు 12 నుంచి 15 వరకు నాలుగు రోజులపాటు ఈ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, …

Read More »

అమరావతి రైతులకు 76 ప్రత్యామ్నాయ ప్లాట్ల కేటాయింపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన పెనుమాక గ్రామ రైతులకు గురువారం ఈ-లాటరీ విధానం ద్వారా 76 రిటర్నబుల్‌ ప్లాట్లను కేటాయించారు. రాయపూడిలోని ఏపీ సీఆర్‌డీఏ కార్యాలయంలో రైతుల సమక్షంలో ఈ ప్రక్రియను నిర్వహించారు. మొత్తం 26 మంది రైతులకు కేటాయించిన ప్లాట్లలో 41 నివాస, 35 వాణిజ్య ప్లాట్లు ఉన్నాయి. రాజధాని నిర్మాణం కోసం ఇటీవల భూములిచ్చిన రైతులు, సీడ్ యాక్సిస్ రహదారి నిర్మాణానికి భూములిచ్చిన ఒక రైతుతో పాటు, గతంలో ప్లాట్లు పొందినప్పటికీ వీధి పోటు, …

Read More »

రాజధాని అమరావతిలో పర్యటించిన నాబ్‌ఫిడ్ బృందం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధి పనులను పరిశీలించేందుకు నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ (నాబ్‌ఫిడ్) బృందం గురువారం పర్యటించింది. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు భూ సమీకరణ పథకం (ఎల్‌పీఎస్‌) కింద అభివృద్ధి చేస్తున్న జోన్‌-4 బ్లాక్‌-4, జోన్‌-9 బ్లాక్‌-11, జోన్‌-12 బ్లాక్‌-5 ప్రాజెక్టులను బృందం సందర్శించింది. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను పరిశీలించి, వాటి పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఏపీసీఆర్‌డీఏ, …

Read More »

రాజధాని అమరావతిలో ముగిసిన హడ్కో బృందం పర్యటన

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతిలో గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి సంస్థ (హడ్కో) బృందం చేపట్టిన రెండు రోజుల పర్యటన గురువారం ముగిసింది. బుధ, గురువారాల్లో అమరావతిలో పర్యటించిన బృందం రెండో రోజు పలు మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టులను సందర్శించింది. రాజధాని అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా నిర్మిస్తున్న ఈ2, ఈ4, ఈ5, ఈ7, ఈ11, ఈ13, ఈ15, ఎన్8 రహదారులతో పాటు, భూ సమీకరణ పథకంలోని పదో జోన్‌ ప్రాజెక్టు పనులను హడ్కో బృందం పరిశీలించింది. ఆయా …

Read More »

ఏపీసీఆర్‌డీఏ ఉద్యోగులకు ప్రాణరక్షణ నైపుణ్యాలపై శిక్షణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన ప్రాథమిక ప్రాణరక్షణ నైపుణ్యాలపై ఏపీసీఆర్‌డీఏ ఉద్యోగులకు గురువారం రాజధాని అమరావతిలోని రాయపూడి ప్రాజెక్టు కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఏపీసీఆర్‌డీఏ సామాజిక అభివృద్ధి విభాగం ఆధ్వర్యంలో మంగళగిరి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) వైద్య నిపుణుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అకస్మాత్తుగా గుండె ఆగిపోయిన సందర్భాల్లో వైద్య సహాయం అందేలోపు బాధితులకు ప్రాథమిక గుండె-ఊపిరితిత్తుల పునరుజ్జీవ ప్రక్రియ (సీపీఆర్‌) ద్వారా ఎలా సహాయం అందించాలనే అంశంపై …

Read More »