Breaking News

భ‌క్తుల సేవ‌లో.. క‌లెక్ట‌ర్ నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌..

-క‌మాండ్ కంట్రోల్ కేంద్రంతో పాటు క్షేత్ర‌స్థాయిలో సుడిగాలి త‌నిఖీలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దసరా ఉత్సవాల్లో 5వరోజు -జగన్మాత శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తుండగా ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతుంది. అన్ని క్యూ లైన్ల‌లో భక్తులు త‌ర‌లివెళ్తూ అమ్మ ద‌ర్శ‌నం చేసుకుంటున్నారు. మ‌రోవైపు రాష్ట్రం న‌లుమూల‌ల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వ‌స్తున్న భ‌క్తుల‌కు ఎక్క‌డా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని శాఖ‌లు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేస్తున్నాయి. జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ఎప్ప‌టిక‌ప్పుడు క్షేత్ర‌స్థాయిలో క్యూలైన్ల‌ను ప‌రిశీలిస్తుండ‌టంతో పాటు కొండ దిగువున గ‌ల సమీకృత క‌మాండ్ కంట్రోల్ కేంద్రం (ఐసీసీసీ) నుంచి ప‌రిస్థితుల‌ను తెలుసుకుంటున్నారు. స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారుల‌కు దిశానిర్దేశం చేస్తున్నారు.
ర‌ద్దీ నియంత్ర‌ణ‌, వీవీఐపీ, వీఐపీ వాహ‌నాల రాక‌పోక‌లు, క్రౌడ్ మేనేజ్‌మెంట్‌, శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌.. ఇలా ప్ర‌తి విష‌యంలోనూ సీసీసీ ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌లో కీల‌కంగా నిలుస్తోంది. న‌గ‌రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన సీసీటీవీలు, డ్రోన్ల విజువ‌ల్స్‌ను నిరంత‌రం ప‌రిశీలిస్తూ ఎక్క‌డా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉత్స‌వాల విజ‌య‌వంతానికి సీసీసీ సిబ్బంది కృషిచేస్తున్నారు. ఆధునిక కెమెరాల డేటాను కూడా ఎప్ప‌టిక‌ప్పుడు విశ్లేషిస్తూ వాహ‌నాల ఎంట్రీ, ఎగ్జిట్‌ను నిశితంగా ప‌రిశీలిస్తూ ఘాట్ రోడ్డుపై ట్రాఫిక్ జామ్ కాకుండా, నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌ల జ‌ర‌క్కుండా చూస్తున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

హజ్–2027 యాత్రికుల ఎంబార్కేషన్ పాయింట్ల మార్పు కోసం వినతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: హజ్–2027 యాత్రకు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 11 మంది యాత్రికులు తమ ప్రయాణ …