Breaking News

ఏపీలో నాలుగు రోజుల పాటు వర్షాలు

-పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ప్రఖర్‌ జైన్‌

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రానున్న నాలుగు రోజుల పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రఖర్‌ జైన్‌ తెలిపారు. శుక్రవారం మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు పడే సమయంలో చెట్ల కింద, భారీ హోర్డింగ్‌ల వద్ద నిలబడరాదని సూచించారు.

శుక్రవారం వర్ష సూచన: విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, వైఎస్సార్‌ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పోలవరం, విశాఖపట్నం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడవచ్చన్నారు.

శనివారం వర్ష సూచన: అల్లూరి సీతారామరాజు, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్‌ జైన్‌ వెల్లడించారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

భారీ వర్షపాతం నమోదు: గురువారం సాయంత్రం 5 గంటల వరకు తిరుపతి జిల్లా అలివేలుమంగాపురంలో అత్యధికంగా 87.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెల్లూరు జిల్లా దగదర్తిలో 57.2 మి.మీ., కావలిలో 53.3 మి.మీ., చిత్తూరు అర్బన్‌లో 51.5 మి.మీ., తిరుపతి జిల్లా ఓబులవారిపల్లెలో 50.4 మి.మీ., పెన్నేపల్లిలో 45.7 మి.మీ., రేణిగుంటలో 41.2 మి.మీ., పుత్తూరులో 40.5 మి.మీ., నాయుడుపేటలో 38.4 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

పిడుగులు పడే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని, వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

హజ్–2027 యాత్రికుల ఎంబార్కేషన్ పాయింట్ల మార్పు కోసం వినతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: హజ్–2027 యాత్రకు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 11 మంది యాత్రికులు తమ ప్రయాణ …