రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వొచ్చే సమావేశం నాటికి వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రస్తుత దిగుబడి, ఆదాయ వనరులు, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డా.కె. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో వ్యవసాయ, మత్స్య, ఉద్యాన అనుబంధం, మార్కెటింగ్ సెరి కల్చర్, శాఖల జిల్లా డివిజన్ స్థాయి అధికారులతో ప్రాథమిక రంగం పై జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ తో కలసి బుధవారం ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కె. మాధవీలత మాట్లాడుతూ, వ్యవసాయ అనుబంధ శాఖలు వారి సాధించాల్సిన లక్ష్యాలను సాధించేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ క్రాప్ బుకింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లాలో జగనన్న పాలవెల్లువ పధకాన్ని బలోపేతం చేసేందుకు కార్యచరణ ప్రణాళికలతో రావాలన్నారు. వ్యవసాయ అధికారులు రైతు భరోసా కేంద్రాల వద్ద ధాన్యం, వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేపట్టాలని ఆదేశించారు. రబీ, ఖరీఫ్ లో పంట సాగు విస్తీర్ణం, ఎరువుల వాడకం, సాగు చేసే ధాన్యం రకాలపై పై వివరాలు తెలుసుకున్నారు. వ్యవసాయ సి హెచ్ సి కేంద్రాల ప్రస్తుత పరిస్థితి , ఈ క్రాప్ బుకింగ్ పై సమాచారాన్ని అందివ్వా లని ఆదేశించారు. హార్టికల్చర్ రంగంలో జిల్లాలో ఏఏ ప్రాంతాల్లో ఏ ఏ పంటలు సాగు విస్తీర్ణం లో ఉన్నాయో వివరాలు తెలియచెయ్యలన్నారు. ఆయిల్ ఫామ్, పండ్ల తోటలు, పూల మొక్కల సాగు విస్తీర్ణం, దిగుబడి , ఇతర సానుకూల పంటలు పై సమీక్షించారు. మత్స్య శాఖ పరిధిలో ఆక్వా, చేపలు సాగుచేసే చెరువుల విస్తీర్ణం, రైతులు , సీడ్స్ పై సమీక్షించారు. మార్కెటింగ్ సంస్థ ద్వారా చేపడుతున్న నాడు నేడు పనుల పురోగతి పై సమీక్షించారు. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారుల జిల్లా పరిధి , సిబ్బంది వివరాలు, కార్యాలయాలు, తదితర అంశాల పై కలెక్టర్ సమగ్రంగా తెలుసుకుని సమీక్షించారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు, జిల్లా పశుసంవర్ధక అధికారి డా. ఎస్ జి టి సత్య గోవిందం, జిల్లా మత్స్య శాఖాధికారి వి. కృష్ణా రావు, జిల్లా ఉద్యానవన అధికారి వి. రాధాకృష్ణ, పశుసంవర్ధక శాఖ ఉపసంచాలకులు డా.కె. శ్రీనివాసులు, డా.ఆర్. వెంకటేశ్వరరావు, మార్కెటింగ్ జిల్లా అధికారి కె. సూర్య ప్రకాష్ రెడ్డి, సహాయ వ్యవసాయ అధికారులు, హార్టికల్చర్ అధికారులు , తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News