కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన దినేష్ కుమార్

-నగర పాలక సంస్థ కార్యాలయం, ఆనం కళాకేంద్రం తనిఖీ
-శనివారం ఉదయం 11 గంటలకు పునర్ ప్రారంభం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కమిషనర్ కె. దినేష్ కుమార్ భాద్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ డా.మాధవీలత ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందచేశారు.

ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసిన కలెక్టర్ డా.మాధవీలత, జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరానికి చరిత్రాత్మకమైన ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. నగరాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు తయారు చేసి అభివృద్ధి పరచాలని సూచించారు.

ఆనం కళాకేంద్రం సందర్శన :
నగరపాలక సంస్థ కమిషనర్ గా భాద్యతలు చేపట్టిన కె.దినేష్ కుమార్ నగర పాలక సంస్థ లోని వివిధ విభాగాలను పరిశీలించి, ఆయా విభాగాల పనితీరు పై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రం ను పరిశీలించి శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభోత్సవం కోసం తగిన ఏర్పాట్లు చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు. కోవిడ్ కారణంగా గత రెండు సంవత్సరాలుగా ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించలేదని అధికారులు తెలిపారు. కళా , సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికగా నిలిచి నగరంలో ఒక సాంస్కృతిక కళా వేదికగా ఆనం కళాకేంద్రంకి పునర్ వైభవాన్ని తీసుకుని రావడం జరుగుతుందని దినేష్ కుమార్ తెలిపారు. స్టేజి డెకరేషన్ , లైటింగ్, సిట్టింగ్ కెపాసిటీ వంటి వాటిపై సమీక్షించి, సూచనలు చేశారు.

కమిషనర్ తో నగర పాలక సంస్థ డీఈ జి. పాండురంగారావు, ఈఈ ఆర్.శేషగిరిరావు, డీఈ పి. ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *