రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మ్యూటేషన్ కోసం ప్రజలు చేసుకున్న దరఖాస్తులను సరైన కారణాలు లేకుండా తిరస్కరించరాదనీ జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ స్పష్టం చేసారు. శనివారం తహసీల్దార్ లతో మ్యూటేషన్ కోసం వొచ్చిన దరఖాస్తులపై కలెక్టరేట్ నుంచి డీఆర్వో ఎ. సుబ్బారావు తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా జేసీ శ్రీధర్ మాట్లాడుతూ, పట్టాదారు పాసు పుస్తకం లో పేర్లు మార్పు, తదితర అంశాల కొరకు మ్యూటేషన్ దరఖాస్తు లు పలు సందర్భాల్లో తహసీల్దార్ లకు చేసుకోవడం జరుగుతుందన్నారు. అటువంటి దరఖాస్తు లను సరైన కారణాలు చూపకుండా తిరస్కరించడం జరుగుతోందన్నారు. అందువలన అటువంటి వారు తిరిగి తిరిగి దరఖాస్తులు చేసుకోవడం తమ దృష్టికి వొచ్చిందన్నారు. ఏదైనా అటువంటి దరఖాస్తు లు తిరస్కరిస్తే సరైన కారణాన్ని స్పష్టంగా దరఖాస్తు దారునికి తెలియచేయ్యాల్సి ఉంటుందన్నారు. పాసు పుస్తకాలు వివిధ కారణాలతో వారికీ అందుబాటులో ఉండవని, కోర్ట్ కేసులు, కుటుంబ విభేదాలు, బ్యాంకులో తనఖా, లింక్ డాక్యూ మెంట్లు, కోర్ట్ కేసులు వంటి కారణాలు ఉండవోచ్చని అధికారులు తెలిపారు. సబ్ డివిజన్ చేసే అధికారం తహసీల్దార్ లకే ఉంటుందని తెలిపారు. ఇకపై ఏదైనా ఒక దరఖాస్తు తిరస్కరిస్తే కారణం నోటీసులో తప్పనిసరిగా పేర్కొనలని తెలియచేసారు. ఈ కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ నుంచి డీఆర్వో ఎ. సుబ్బారావు, వీడియో కాన్ఫరెన్స్ లో ఆయా మండలాలు నుంచి మండల తహసీల్దార్ లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News