రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రుడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిల రెడ్డి మరియు రుడా వైస్ చైర్మన్ కె.దినేష్ కుమార్, I.A.S., రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (రుడా), రాజమహేంద్రవరం వారి అధ్యక్షతన శనివారం రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పొరేషన్ మీటింగ్ హాల్ నందు రుడా పరిథిలో జిల్లా పంచాయతీ ఆఫీసర్లు, డివిజనల్ లెవెల్ పంచాయతీ ఆఫీసర్లు, మరియు పంచాయతీ సెక్రెటరీలతో మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో డెలిగేషన్ అఫ్ పవర్స్ జి.ఒ ఎమ్.ఎస్.నెం. 443, ఎమ్.ఎ. & యు.డి. తేది. 18-12-2017 ప్రకారం డెలిగేషన్ అఫ్ పవర్స్ మరియు APDPMS,Panchayat Raj Information System (PRIS) software గురించి రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (రుడా) పరిధిలో గల జిల్లా పంచాయతీ ఆఫీసర్లు, డివిజనల్ లెవెల్ పంచాయతీ ఆఫీసర్లు, మరియు పంచాయతీ సెక్రెటరీలకు అవగాహన కల్పించినారు. గతంలో కూడా తేది.21-01-2022న కరోనా తీవ్రత వల్ల జూమ్ మీటింగ్ నిర్వహించి ఆన్ లైన్ సిస్టమ్ ఆమోదము పై అవగాహన కల్పించినారు. ఆన్లైన్ సిస్టమ్ నందు పంచాయతీల పరిధిలో ఉండే 300 చ.మీ.లకు లోబడి భవన నిర్మాణాలు, లేవుట్లు మరియు ఇండస్ట్రీస్ అప్లికేషన్స్ ఏ విధంగా అప్ లోడ్ చెయ్యాలో తెలియపరిచినారు మరియు రుడా పరిధిలో ప్రస్తుతము PRIS APP ద్వారా 2144 భవన నిర్మాణ అనుమతులు అప్లై చేయగా 1421 అనుమతులు ఇచ్చియున్నామని, 14 తిరస్కరించి యున్నామని, 34 దరఖాస్తులు shortfall నందు వుంచమని మరియు 675 దరఖాస్తులు పెండింగ్ లో వున్నవనియు, ఇంకను రుడా పరిధిలో వున్న 207 గ్రామ పంచాయతీలకు గాను 51 గ్రామ పంచాయతీలు ఇంకను PRIS APP వినియోగములోనికి తేలేదని వారు వెంటనే వినియోగించుకోవాలని ఆదేశించియున్నారు మరియు గ్రామ పంచాయతీలన్నియు అన్ని విధములైన రిజిష్టర్లు అనగా బిల్డింగ్, లేవుట్ , అనధికార బిల్డింగ్, అనధికార లేవుట్ ల రిజిష్టర్లు మెయిన్ టైన్ చేయవలిసినదిగా ఆదేశించినారు. పంచాయతీ పరిధిలో ఎటువంటి అక్రమ నిర్మాణములు, అక్రమ లేవుట్లు చేపట్టినవాటిపై సదరు పంచాయతీ సెక్రటరీలు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలిసినదిగా ఆదేశములు ఇవ్వడం జరిగినది. అట్లు చేయని యెడల సదరు పంచాయతీ సెక్రెటరీలపై తగు చర్యలు తీసుకోనుబడునని తెలియపరిచినారు.
సదరు సమావేశము నందు రుడా ప్లానింగ్ ఆఫీసర్ టి.జి. రామ్ మోహన్, రుడా సెక్రటరీ జి. శైలజవల్లి, రుడా అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ కె.వెంకట రావు, రుడా టి.పి.ఎస్. కె. రాజ కుమారి, నిడదవోలు, కొవ్వూరు మునిసిపల్ కమిషనర్లు, రుడా పరిధిలో గల జిల్లా పంచాయతీ ఆఫీసర్లు, డివిజనల్ లెవెల్ పంచాయతీ ఆఫీసర్లు, మరియు పంచాయతీ సెక్రెటరీలతో తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News