నూతన రెవెన్యూ అసోసియేషన్ కి అభినందనలు తెలిపిన జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నూతనంగా తూర్పుగోదావరి జిల్లా ఏర్పడిన తర్వాత రెవెన్యూ శాఖ పరిధిలోని ఉద్యోగులు తాత్కాలికంగా అసోసియేషన్ గా ఏర్పడి ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడం లో సమిష్టి బాధ్యత తో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. బుదవారం సాయంత్రం సంయుక్త తూర్పు గోదావరి జిల్లా పూర్వపు అధ్యక్షులు పితాని త్రినాధ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో తాత్కాలిక నూతన కార్యవర్గం కలెక్టర్ ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చెం అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభినందనలు తెలిపి మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వానికి వారధులుగా రేవెన్యుఉద్యోగులు వత్తిడితో పనిచేయాల్సి ఉంటుందన్నారు. జిల్లా నూతనంగా ఏర్పడినందున కొన్ని సవాళ్ళను ఎదుర్కొని, వాటిని అధిగమించవలసి ఉంటుందన్నారు. జిల్లా యంత్రాగానికి అన్ని విధాలుగా ఏ శాఖ అసోసియేషన్ అయినా సహకారం అందించి, జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలపునిచ్చారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా కృషి చేస్తూ అండగా ఉంటానని పేర్కొన్నారు. ఈసందర్భంలో కలెక్టర్ ని తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పి. త్రినాధ రావుతో పాటు సిహెచ్. సురేష్ బాబు, డిటి, ఛైర్మన్ జి. సుబ్రహ్మణ్యం, కన్వీనర్. జి. బాపిరాజు, కోశాధికారి మరియు నూతన 12 మంది సభ్యులు కలిశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *