-జిల్లా వ్యాప్తంగా ఉన్న 522 వార్డు/ గ్రామ సచివాలయాల్లో అవగాహన సదస్సులు..
-రహదారి ప్రమాదాల నివారణకు వాహన చోదకులకు అవగాహన పెంచాలి
-రాజమహేంద్రవరం నగర పరిధిలో వేగం పరిమితి అమలు చెయ్యాలి..
-బ్లాక్ స్పాట్స్ / అత్యంత ప్రమాదకర మలుపులు గుర్తించాలి..
-ప్రమాద నివారణకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చెయ్యండి..
-జిల్లా కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో రోడ్డు ప్రమాదాల కారణంగా మరణాలు సంభవించకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరికి రహదారి భద్రతపై అవగాహన పెంచాలని జిల్లా కలెక్టర్ డా. కె.మాధవిలత అన్నారు. శుక్రవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ మాధవిలత, ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ సంబంధిత శాఖల అధికారులు తో రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల కారణంగా ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు లేకుండా నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ మేరకు రెవెన్యు, రవాణా, పోలీస్, జాతీయ రహదారులు, ఆర్ అండ్ బి , పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులకు సూచనలను చేశారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై స్పీడ్ గన్స్ ఏర్పాటుచేసి పర్యవేక్షణ చేపట్టాలన్నారు. ప్రమాదం జరిగిన తొలి అరగంట ఎంతో కీలకం అయినదని, ఆ సమయంలో ప్రాథమిక చికిత్స అందజేస్తే ప్రాణాలను పోకుండా కాపాడడం సాధ్యం అవుతుందని ఆమె పేర్కొన్నారు. తక్షణ సహాయం కోసం 1033 హెల్ప్ లైన్ (ఎమర్జెన్సీ అంబులెన్స్ ) పై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. రహదారి ప్రమాదాల్లో వెంటనే స్పందించి సమాచారం అందించి ఆదుకునే వారికి ప్రభుత్వం పరంగా రూ. ఐదు వేలు పారితోషకం అందించే విధంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ప్రతి ఒక్కరికీ రహదారి భద్రతపై అవగాహన పెంచే దిశలో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న 522 వార్డు/ గ్రామ సచివాలయాల్లో ఉన్న కార్యదర్శులకు, వాలంటీర్ లకు, సిబ్బందికి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ పొందిన వాలంటీర్ వారి పరిధిలోని ప్రతి ఒక్క కుటుంబానికి, ముఖ్యంగా మహిళలకు శిక్షణా వివరాలు తెలపాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా యువత మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం, కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా ప్రమాదాలకు కారణం అని తెలిపారు. ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. రహదారులకు ఇబ్బందికరంగా ఉండే ఫ్లెక్సీలను తొలగించాలని , విచ్చలవిడిగా పార్కింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, సరైన లైటింగ్ లేకపోవడం, ప్రధాన కారణాలలో ఒకటని పేర్కొన్నారు. ప్రామాణిక ప్రక్రియ పద్ధతి (SOP) లో రహదారులను శుభ్ర పరచడానికి తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్ సమీక్ష చేస్తూ, నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవాలని స్పష్టం చేశారు. దివాన్ చెరువు నుంచి వేమగిరి వరకు లైటింగ్ ప్రతిపాదనలు ఏర్పాటు, హైవే పై చెత్త లేకుండా క్లీన్ చేయించే విధంగా చర్యలు తీసుకోవసలని జిల్లా పంచాయితీ అధికారిని ఆదేశించారు. హైవే వాహనాలు వారికి కేటాయించిన స్థలల్లోనే నిలుపుదల చేయాలి. రోడ్ సేఫ్టీ పై ప్రతి నెల సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఎన్ హెచ్ సి, హేచ్ సి హైవేలపై ప్రమాదాలు జరగకుండా ప్రజలకు ఆవాహన కల్పించాలి. జిల్లా ఆసుపత్రి వద్ద ట్రాఫిక్ కంట్రోల్ చేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ పోలీస్, ఆర్ అండ్ బి అధికారులకు సూచించారు.
బ్లాక్ స్పాట్స్ / బ్లాక్ హోల్స్ (అత్యంత ప్రమాదకర స్థలాలు) ఉన్నాయో వాటిని గుర్తించేందుకు పోలీసు, రహదారులు శాఖ అధికారులు జాయింట్ ఇన్స్పెక్షన్ చేయాలని ఎస్ పి ఐశ్వర్య రస్తోగి పేర్కొన్నారు. వాటి వద్ద ప్రమాద సూచికలు, రుబ్బెల్ స్ట్రిప్స్, జాతీయ రహదారులను కలిపే అంతర్ రహదరు లవద్ద ధర్మో ప్లాస్టిక్ బోర్డులు ఏర్పాటు చేసి వాహన చోదకులను అప్రమత్తం చేసే విధంగా హెచ్చరిక బోర్డులు, వేగనియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. తక్షణం ఆయా ప్రదేశాల్లో మార్కింగ్ లు , మలుపుల వద్ద సూచికలు తక్షణం ఏర్పాటు చేయాలని రహదారులు, భవనాల శాఖ, జాతీయ రహదారుల శాఖ అధికారులను ఆదేశించారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని రక్షించడం కనీస భాధ్యత అని పేర్కొన్నారు. ఆ ప్రమాదం చేసిన వాహనం యొక్క డ్రైవరు/వ్యక్తి గానీ గాయపడిన వ్యక్తిని మోటారు వాహనాల చట్టం 1988 సెక్షన్ 134 ప్రకారం చికిత్స కోసం ఆసుపత్రికి తరలించి వైద్యము అందేలా చూడాలన్నారు. ఒకవేళ ఆనిబంధనను అతిక్ర మించినట్లైనా, ప్రమాద వివరాలు తెలియ పరచక పోయినా మో.వా .చట్టం 1988 లోని సెక్షన్ 187 ప్రకారం రూ.5 వేలు జరిమానా, 6 నెలలు జైలు శిక్షా లేక రెండు విధించ వచ్చునని తెలిపారు. ఈ సమావేశంలో మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, రవాణా, పోలీసు, రహదారుల,రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ, మునిసిపల్ అధికారులు టీఏస్ రెడ్డి, వై అర్ కె రావు, జివి రామారావు, టి. రవికుమార్, ఎస్. బివి రెడ్డి, పివి రమణ, ఎన్. శ్రీనివాస్, ఏ. శ్రీధర్, వై వివి యన్ కుమార్, కె. చంద్ర రావు, ఐ. కా, పి ఎమ్ సత్యవతి, తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News