ఆర్భాటాల కోసం విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయొద్దు… : నేతి మహేశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
హంగు ఆర్భాటాల కోసం ఆంగ్ల మాధ్యమం తీసుకురావద్దని, దీనివలన విద్యార్థుల భవిష్యత్తు నాశనం అయిపోతుందని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షులు నేతి మహేశ్వరరావు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నేతి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పదవ తరగతి ఫలితాలు విద్యార్థులను నిరుత్సాహపరిచాయన్నారు. ప్రస్తుత విద్యా విధానం రాజకీయాల కోసం చేసినట్టు ఉందన్న సందేహం కలుగుతుందన్నారు. ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి అని ప్రభుత్వం ప్రకటించటం వలనే చాలా మంది పరీక్షలలో ఫెయిల్ అయ్యారని అనుమానం వ్యక్తం చేశారు. ఆంగ్లం అనేది తప్పనిసరి కాకుండా ఒక సబ్జెక్ట్ గా ఉంచాలని ఆయన కోరారు. తెలుగు నుంచి ఆంగ్లానికి మారడం అనేది ప్రచారానికి ఉపయోగపడుతుంది కానీ విద్యార్థులకు ఉపయోగకరం కాదన్నారు. ప్రభుత్వ చర్యలు విద్యా ప్రమాణాలు పెంచేలా ఉండాలి కానీ, దిగజార్చేలా ఉండకూడదని ఆయన హితవు పలికారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం కార్యదర్శి బొప్పన రాజశేఖర్ రావు, సంయుక్త కార్యదర్శి పావులూరి ఖాజారావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *